త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Transgender | పెండ్లి చేసుకున్న వ్య‌క్తి వ‌దిలి వెళ్లాడ‌ని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!

Transgender | సిద్దిపేట (Siddipet) ప‌ట్ట‌ణంలోని లింగ‌రెడ్డిప‌ల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టపడి వివాహం చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడాని ఓ ట్రాన్స్‌జెండర్‌ (Transgender) ఆత్మహత్య చేసుకుంది.

G

Telangana | Published On Sep 25, 2026, 12.38 pm IST

Transgender | పెండ్లి చేసుకున్న వ్య‌క్తి వ‌దిలి వెళ్లాడ‌ని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!
Advertisement

Transgender | త్రినేత్ర న్యూస్‌: సిద్దిపేట (Siddipet) ప‌ట్ట‌ణంలోని లింగ‌రెడ్డిప‌ల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టపడి వివాహం చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడాని ఓ ట్రాన్స్‌జెండర్‌ (Transgender) ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ (Balapur) మండలానికి చెందిన జెర్పాటి శివ (25) నాలుగేండ్ల‌ క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారి సునందగా పేరు మార్చుకున్నారు. సిద్దిపేట పట్టణానికి వచ్చి స్థానిక లింగారెడ్డిపల్లి ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంట్లో ట్రాన్స్‌జెండర్లతో కలిసి నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో సునందకు సిద్దిపేటకు చెందిన బత్తుల అజయ్‌కుమార్‌తో పరిచయమైంది. అదికాస్తా ప్రేమ‌గా మార‌డంతో రెండున్నరేండ్ల‌ క్రితం ఇరువురు వివాహం చేసుకున్నారు. అయితే కొద్దికాలం తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21న బాండ్‌ పేపర్‌ రాసుకున్నారు. అయితే తాను పెండ్లి చేసుకున్న వ్యక్తి విడిపోతున్నాడనే మాన‌సిక వేద‌న‌తో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని (Suicide) సునంద‌ ఆత్మహత్య చేసుకున్న‌ది. మృతురాలి సోదరుడు మల్లేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement