త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Online Betting | బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో ప‌డ్డాడు.. అప్పు తీర్చలేక బాస‌ర IIIT విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Online Betting | బెట్టింగ్ యాప్‌ల (Online Betting) ఉచ్చులో ప‌డి అప్పుల‌పాల‌య్యాడు. భారంగా మారిన అప్పుల‌ను తీర్చ‌లేక ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య (IIIT Student) చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన చల్లా సంపత్.. నిర్మ‌ల్ జిల్లా బాస‌ర‌లోని ట్రిపుల్ ఐటీ (RGUKT)లో సీఎస్‌ఈ సెకండియర్‌ చదువుతున్నాడు.

G

Telangana | Published On Nov 24, 2026, 12.29 pm IST

Online Betting | బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో ప‌డ్డాడు.. అప్పు తీర్చలేక బాస‌ర IIIT విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
Advertisement

Online Betting | త్రినేత్ర న్యూస్‌: బెట్టింగ్ యాప్‌ల (Online Betting) ఉచ్చులో ప‌డి అప్పుల‌పాల‌య్యాడు. భారంగా మారిన అప్పుల‌ను తీర్చ‌లేక ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య (IIIT Student) చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన చల్లా సంపత్.. నిర్మ‌ల్ జిల్లా బాస‌ర‌లోని ట్రిపుల్ ఐటీ (RGUKT)లో సీఎస్‌ఈ సెకండియర్‌ చదువుతున్నాడు. సోమ‌వారం రాత్రి గోదావ‌రి హాస్ట‌ల్‌లోని త‌న గ‌తి 206లో ఉరివేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. తోటి విద్యార్థులు స‌మాచారంతో హాస్ట‌ల్ సిబ్బంది అత‌డిని భైంసా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే అత‌డు మృతిచెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

కాగా, విద్యార్థులు, సిబ్బంది తెలిపిన సమాచారం ప్రకారం.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో (Betting Apps) సంపత్ సుమారు రూ. 2 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పు చెల్లించాల‌ని యాప్‌ల నిర్వాహకుల నుంచి ఒత్తిడి అధిక‌మ‌వుతుండ‌టంతో కాలేజీ ఫీజు చెల్లించాలనే కారణం చెప్పి తన బాబాయ్‌ వద్ద రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అదేవిధంగా తన తల్లి విజయ బ్యాంకు ఖాతా నుంచి మరో రూ.50 వేలు తీసుకున్నట్లు తెలిసింది. అయినా అప్పులు తీర్చే మార్గం లేక పోవ‌డం, బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయిన మనస్తాపంతో హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకుని (Suicide) ప్రాణాలు తీసుకున్నాడు.

అయితే స్నేహితుల కార‌ణంగానే తన కుమారుడు మ‌ర‌ణించిన‌ట్లు మృతుడి త‌ల్లి విజ‌య ఆరోపించారు. వారే అత‌నికి బెట్టింగ్ (Betting) అలవాటు చేశార‌ని వాపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెడు అలవాట్లతోపాటు, బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.

Advertisement
Advertisement