త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | న‌ల్ల‌గొండ జిల్లాలో 6 పుర‌పాలిక‌లు హ‌స్త‌గ‌తం.. చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్‌జెండ‌ర్ విజ‌యం

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో కాంగ్రెస్ 584 వార్డుల్లో విజ‌యం సాధించ‌గా, బీఆర్ఎస్ 310, బీజేపీ 87, ఇత‌రులు 86 చోట్ల గెలుపొందారు. న‌ల్ల‌గొండ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఐదింటిని కాంగ్రెస్ ద‌క్కించుకున్న‌ది.

G

Telangana | Published On Feb 13, 2026, 11.38 am IST

Municipal Elections | న‌ల్ల‌గొండ జిల్లాలో 6 పుర‌పాలిక‌లు హ‌స్త‌గ‌తం.. చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్‌జెండ‌ర్ విజ‌యం
Advertisement

Municipal Elections | త్రినేత్ర.న్యూస్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో కాంగ్రెస్ 584 వార్డుల్లో విజ‌యం సాధించ‌గా, బీఆర్ఎస్ 310, బీజేపీ 87, ఇత‌రులు 86 చోట్ల గెలుపొందారు. న‌ల్ల‌గొండ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల‌ను కాంగ్రెస్ ద‌క్కించుకున్న‌ది. మిర్యాల‌గూడ‌లో ఫ‌లితం తేలాల్సి ఉంది. కాగా, చిట్యాల (Chityal) మున్సిపాలిటీలో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ (Transgender) విజ‌యం సాధించారు. మొద‌టి వార్డులో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేసిన‌ నాగిళ్ల సుధాక‌ర్ త‌న స‌మీప అభ్య‌ర్థిపై 102 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, చిట్యాల పుర‌పాలిక‌లో మొత్తం 12 వార్డులు ఉండ‌గా, హ‌స్తం పార్టీ 9 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 2, స్వ‌తంత్రులు ఒక చోట విజ‌యం సాధించారు.

జిల్లాలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల‌ను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. నందికొండ మున్సిపాలిటీలో అధికార పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ప‌ట్ట‌ణంలో మొత్తం 12 వార్డులు ఉండ‌గా 11 చోట్ల విజ‌యం సాధించింది. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో స‌రిపెట్టుకున్న‌ది. అదేవిధంగా హాలియాలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 11 వార్డుల‌ను సొంతం చేసుకున్న‌ది. ఇక్క‌డ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క వార్డుకే ప‌రిమిత‌మైంది.

దేవ‌రకొండ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండ‌గా 10 చోట్ల కాంగ్రెస్‌, 7 వార్డుల్లో గులాబీ పార్టీ, బీజేపీ 1, ఇత‌రులు 2 స్థానాల్లో విజ‌యం సాధించారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల‌కు గాను కాంగ్రెస్ 6 చోట్ల విజ‌యం సాధించింది. బీఆర్ఎస్ 3, ఇత‌రులు 1 చోట గెలుపొందారు. ఇక మిర్యాల‌గూడ‌లో ఫలితం తేలాల్సి ఉన్న‌ది.

జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మిర్యాల‌గూడ‌లో కూడా కాంగ్రెస్ పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో హ‌స్తం పార్టీ 31 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇత‌రులు 6 చోట్ల విజ‌యం సాధించారు.

Advertisement
Advertisement