త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uday Krishna Reddy | లైంగిక ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

G

Telangana | Published On Jul 20, 2026, 12.31 pm IST

Uday Krishna Reddy | లైంగిక ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
Advertisement

Uday Krishna Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: లైంగిక ఆరోపణలు (Harassment) ఎదుర్కొంటున్నట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. ఆదివారం మోతీనగర్‌లోని బంధువు ఇంటికి వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి (Trainee IPS) .. సోమ‌వారం ఉదయం విషం తాగారు. గమనించిన బంధువులు ఆయనను హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లోని ప్రైవేటు ద‌వాఖాన‌కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఐసీయూలో ఉదయ్ కృష్ణారెడ్డికి చికిత్స అందిస్తున్నారు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.

అంత‌కుముందు తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై (Harassment Allegations) సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉద‌య్ కృష్ణారెడ్డి స్పందించారు. `తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తవం. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంద. న్యాయం తప్పక గెలుస్తుంది` అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్​ చేశారు. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కర్ణాటకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్​ను వేధిస్తున్నారని, నిన్న అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఉదయ కృష్ణారెడ్డిపై కేసునమోదయిన విషయం తెలిసిందే.

 

వాట్సాప్​లో అసభ్యకరమైన మెసేజ్‌లు

కర్ణాటకకు (Karnataka) చెందిన ఓ మహిళ (30) సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికై ప్రస్తుతం శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో (NPA) శిక్షణ పొందుతున్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఐపీఎస్​ శిక్షణలో ఉన్నారు. జూన్ 23 నుంచి ఉదయ్‌ కృష్ణారెడ్డి వాట్సప్ నంబర్‌ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడ‌ని బాధితురాలు అత్తాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యక్తిగత దూషణలు, మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. త‌న‌ను బ‌ల‌వంతంగా త‌న మొబైల్ ఫోన్ లాక్కుని, వ్య‌క్తిగ‌త స‌మాచారం తెలుసుకొని ఇబ్బందికి గురిచేశాడ‌ని, గ‌దిలోకి లాక్కెళ్లి క‌త్తితో బెదిరించి ఫోన్ పాస్‌వ‌ర్డ్ తీసుకున్నాడ‌ని తెలిపారు. త‌న‌తో అభ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించి, వ్య‌క్తిగ‌త వీడియో తీశాడ‌ని వెల్ల‌డించారు. వాటిని త‌న భ‌ర్త‌కు పంపి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని చెప్పారు. దీంతో కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

శిక్ష‌ణ సంద‌ర్భంగా ఉద‌య్ కృష్ణారెడ్డి స‌హ‌చ‌రుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు గుర్తించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాడ‌ని, త‌ప్పుడు మెసేజ్‌ల‌తో ప‌లువురిని మ‌నో వేధ‌న‌కు గురిచేశాడ‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించారు. దీంతో నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు పోలీసులు సిద్ధ‌మ‌య్యారు.

Advertisement
Advertisement