Suicide Attempt | గచ్చిబౌలి పోలీసుల సమయస్ఫూర్తి.. హెచ్‌సీయూ విద్యార్థి ప్రాణాలు కాపాడిన పెట్రోలింగ్ సిబ్బంది
Suicide Attempt | తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) ప్రయత్నించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కి చెందిన 21 ఏండ్ల విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు (Gachibowli Police) సమయస్ఫూర్తితో కాపాడారు.
Suicide Attempt | త్రినేత్ర న్యూస్: తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) ప్రయత్నించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కి చెందిన 21 ఏండ్ల విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు (Gachibowli Police) సమయస్ఫూర్తితో కాపాడారు. హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకేందుకు యత్నిస్తుండగా చివరి నిమిషంలో చేరుకొని నిండు ప్రాణాలను నిలబెట్టారు.
గచ్చిబౌలి పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిరంజన్ లక్రా కుమారుడు అభినవ్ లక్రా (21) హెచ్‌సీయూలో ఎమ్మెస్సీ సైకాలజీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ‘ఎల్’ బాలుర హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే శుక్రవారం ఉదయం అభినవ్ ఓ సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయాడు. దీంతో అతని స్నేహితులు డయల్ 100కు కాల్ చేసి సమాచారమిచ్చారు.
వెంటనే అప్రమత్తమైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ సిబ్బంది నిమిషాల్లోనే హాస్టల్‌కు చేరుకున్నారు. అప్పటికే హాస్టల్ మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకేందుకు యత్నిస్తున్నఅభినవ్‌ను చాకచక్యంగా పట్టుకుని కిందకు దించారు. కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం విశ్వవిద్యాలయ సంక్షేమ విభాగం అధికారులకు అప్పగించారు.
కాగా మానసిక ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నవారు ఆత్మహత్య ఆలోచనలు చేయవద్దని.. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక నిపుణుల సలహాలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షణికావేశాలకు లోనై నూరేళ్ల జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దని.. చక్కని భవిష్యత్‌ను నిర్మించుకోవాలని పేర్కొంటున్నారు.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



