త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. ఉప్ప‌ల్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, వాహ‌నాల దారిమ‌ళ్లింపు

Traffic Restrictions | మ‌రో ఐపీఎల్ (IPL)మ్యాచ్‌కు ఉప్ప‌ల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. బుధ‌వారం సాయంత్రం 7.30 గంట‌ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు పంజాబ్ కింగ్స్‌తో (SRH Vs Panjab Kings) త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఉప్ప‌ల్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు (Traffic Restrictions ) విధించారు.

G

Telangana | Published On May 6, 2026, 7.17 am IST

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. ఉప్ప‌ల్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, వాహ‌నాల దారిమ‌ళ్లింపు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రో ఐపీఎల్ (IPL)మ్యాచ్‌కు ఉప్ప‌ల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. బుధ‌వారం సాయంత్రం 7.30 గంట‌ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు పంజాబ్ కింగ్స్‌తో (SRH Vs Panjab Kings) త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఉప్ప‌ల్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు (Traffic Restrictions ) విధించారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయ‌ని తెలిపారు. స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో వాహ‌నాల దారిమ‌ళ్లింపులు ఉంటాయ‌ని చెప్పారు. భారీ వాహ‌నాలైన‌ లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్ఎంసీ వాహనాలు, జేసీబీలు, ఐచర్ వాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్ల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు.

మ్యాచ్ నేప‌థ్యంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోల్ నుండి హబ్సిగూడ (ఉప్పల్ జంక్షన్ మార్గం) మరియు బోడుప్పల్ నుండి అంబర్‌పేట్ (ఉప్పల్ జంక్షన్, రామంతాపూర్ మార్గం) వరకు మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. అందువ‌ల్ల వాహ‌న‌దారులు వీలైనంతవరకు ఈ మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ రూట్‌ల‌లో వెళ్లాల‌ని సూచించారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వంటి ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను వినియోగించాల‌ని కోరారు.

ఈ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్..

  • ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను మెహఫిల్ హోటల్ వద్ద, హెచ్ఎండీఏ ఉప్పల్ భగాయ‌త్ ప్రవేశద్వారం వద్ద నాగోల్- ఎల్బీ నగర్ వైపు మళ్లిస్తారు.
  • ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూ-టర్న్ తీసుకుని ఉప్ప‌ల్ భాగాయ‌త్‌- టయోటా U టర్న్-బోడుప్పల్-చెంగిచెర్ల-IOCL చెర్లపల్లి లేదా ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు.
  • తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను హబ్సిగూడ ఎక్స్‌ రోడ్ వద్ద నాచారం- ఎన్ఎఫ్‌సీ రోటరీ-IOCL చెర్లపల్లి-ఘట్‌కేసర్ వైపు
  • రామంతాపూర్ నుంచి ఉప్పల్ వచ్చే హెవీ వాహనాలను స్ట్రీట్ నం.8 వద్ద హబ్సిగూడ ఎక్స్‌ రోడ్-నాచారం-NFC రోటరీ-IOCL చెర్లపల్లి-ఘట్‌కేసర్ వైపు
  • వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ఉప్పల్ మార్గం ద్వారా వచ్చే హెవీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ORR ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్-ఎల్బీ నగర్-దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో ప్రయాణించాలి.
  • హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ఉప్పల్ మార్గం ద్వారా వెళ్లే వాహనాలు ఎల్బీ నగర్-హయత్‌నగర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ORR ఎక్కి వరంగల్ చేరుకోవాలి.

పార్కింగ్ ఇక్క‌డ..

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మొత్తం 5 ప్రధాన పార్కింగ్ ప్రదేశాల‌ను ఏర్పాటుచేశారు. వీటిలో 4 స్టేడియం బయట 500 మీటర్ల పరిధిలో సాధారణ ప్రజల కోసంకాగా, ఒకటి స్టేడియం లోపల వీఐపీ పాస్ హోల్డర్లకు కేటాయించారు.

  • పెంగ్విన్, TGIALA, DSL ఓపెన్ ప్రదేశం (NSL భవనం ఎదురుగా), మోడర్న్ బేకరీ వ‌ద్ద సాధార‌ణ ప్రేక్ష‌కులు త‌మ వాహ‌నాల‌ను పార్క్ చేసుకోవ‌చ్చు.
Advertisement
Advertisement