త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddipeta | సిద్దిపేటలో నేడు సీఎం సభ.. పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు

Siddipeta | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సిద్దిపేట‌లో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ జరగనుంది.

S

Telangana | Published On Nov 19, 2026, 10.00 am IST

Siddipeta | సిద్దిపేటలో నేడు సీఎం సభ.. పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement

Siddipeta | త్రినేత్ర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సిద్దిపేట‌లో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ జరగనుంది.

సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, హనుమకొండ, యాదాద్రి, జనగామ, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 25 నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నుండి భారీగా జనం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక మళ్లింపు చర్యలు చేపట్టినట్లు సీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు.

హైదరాబాద్, వరంగల్, గజ్వేల్, హుస్నాబాద్, యాదగిరిగుట్ట వైపు నుండి వచ్చే బస్సులు రంగధాంపల్లి చౌరస్తా, వేములవాడ కమాన్, ఎల్లం ధాబా మీదుగా, కరీంనగర్ బస్సులు రంగీలా ధాబా, ఎల్లమ్మ ఆలయం గుండా.. సిరిసిల్ల, వేములవాడ బస్సులు ఎల్లం ధాబా మీదుగా రావాలి. మెదక్, రామాయంపేట, దుబ్బాక బస్సులు బూరుగుపల్లి, చిన్న గుండవెల్లి, చర్లపల్లి మార్గంలో ప్రయాణించాలి. అన్ని బస్సులు నాగదేవత ఆలయం వద్ద ప్రజలను దించి, కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసుకోవాలి.

సాధారణ వాహనదారులకు మళ్లింపు..

హైదరాబాద్ – కరీంనగర్ మధ్య ప్రయాణించే వారు పట్టణంలోకి రాకుండా రింగ్ రోడ్డు గుండా వెళ్లాలి. పట్టణంలోకి రావాల్సిన వారు రంగధాంపల్లి, బీజేఆర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదుగా, మెదక్, రామాయంపేట వాహనాలు రూరల్ సర్కిల్, ఎన్సాన్‌పల్లి, బీజేఆర్ చౌరస్తా ద్వారా లోపలికి రావాలి. సిరిసిల్ల, వేములవాడతో పాటు ముస్తాబాద్ (గ్రామీణ మార్గం మీదుగా) నుండి వచ్చే వాహనాలు వేములవాడ కమాన్, నర్సాపూర్ చౌరస్తా గుండా పట్టణంలోకి ప్రవేశించాలి. ప్రయాణికులంతా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని, నిర్ణీత చోట్లనే పార్కింగ్ చేస్తూ పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement