Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
Bathukamma | తెలంగాణ బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుండి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరవీరుల స్థూపం నుంచి భారీ బతుకమ్మ ర్యాలీ
రవీంద్రభారతిలో 10 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు
బతుకమ్మకు ప్రత్యేక లోగో రూపొందిస్తున్న ప్రభుత్వం
బతుకమ్మ లోగోలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంశం
Bathukamma | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుండి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజయ్యారు.
18వ తేదీన రాత్రికి ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలచే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎస్ సూచించారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్‌కు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలతో పాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారని సీఎస్ పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు నగరంలోని ప్రధాన జంక్షన్లను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్కులో ఉన్న బతుకమ్మ ఘాట్‌తో పాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు.
సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల మధ్య ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు. అమరవీరుల స్మారక కేంద్రం నుండి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. బతుకమ్మ జరిగే పది రోజుల పాటు రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈసారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్‌లో జరుగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను కూడా ఈ లోగోలో తెలియచేసే విధంగా రూపొందించనున్నట్టు తెలిపారు.
తాజావార్తలు
- ●Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
- ●Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే
- ●Telangana Congress | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీలకు ఇవ్వండి

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?

OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..






