OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఇండియా ఫెస్టివ్ సీజన్ సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అక్టోబర్ 8 అర్ధరాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌తోపాటు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, మింత్రా, బ్లింకిట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్లు లభించనున్నాయి.
Technology | Published On Oct 3, 2026, 5.03 pm IST
OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఇండియా ఫెస్టివ్ సీజన్ సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అక్టోబర్ 8 అర్ధరాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌తోపాటు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, మింత్రా, బ్లింకిట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్లు లభించనున్నాయి. కాంపొనెంట్ ధరలు పెరగడం, కరెన్సీ మార్పిడి ప్రభావం కారణంగా ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల సగటు ధరలు 16 శాతం పెరిగాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్‌లో పలు మోడళ్లపై తాత్కాలిక ధర తగ్గింపులతోపాటు బ్యాంక్ డిస్కౌంట్లను అందిస్తోంది.
తగ్గింపు ధరకు వన్‌ప్లస్ 15..
వన్‌ప్లస్ 15కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ సాధారణ ధర రూ.85,999 కాగా, సేల్‌లో రూ.84,999కు లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డుపై రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో నెట్ ఎఫెక్టివ్ ధర రూ.81,999కి చేరుతుంది. వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్‌కు చెందిన 12జీబీ, 256జీబీ వేరియంట్ రూ.59,999 నుంచి రూ.56,999కు తగ్గనుంది. అదనంగా రూ.2వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.54,999కు పొందవచ్చు. వన్‌ప్లస్ 13ఎస్ 12జీబీ, 256జీబీ మోడల్ రూ.54,999 నుంచి రూ.52,999కు తగ్గుతుంది. రూ.3వేల వరకు కార్డ్ డిస్కౌంట్‌తో నెట్ ధర రూ.49,999గా ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ వేరియంట్ రూ.46,999 నుంచి రూ.44,999కు తగ్గి, బ్యాంక్ ఆఫర్‌తో రూ.42,999కు లభిస్తుంది.
బడ్జెట్ రేంజ్‌లో ఈ ఫోన్లు..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 8జీబీ, 128జీబీ మోడల్ రూ.37,999 నుంచి రూ.35,999కు తగ్గుతుంది. రూ.2వేల వరకు డిస్కౌంట్‌తో రూ.33,999కు లభిస్తుంది. నార్డ్ సీఈ6 లైట్ 8జీబీ, 128జీబీ వేరియంట్ రూ.30,999 నుంచి రూ.28,999కు తగ్గి, రూ.1,500 వరకు కార్డ్ డిస్కౌంట్‌తో రూ.27,499కు చేరుతుంది. బడ్జెట్ విభాగంలో వన్‌ప్లస్ ఎన్6 4జీబీ, 128జీబీ మోడల్ రూ.24,999 నుంచి రూ.23,499కు తగ్గుతుంది. రూ.1,500 వరకు డిస్కౌంట్‌తో రూ.21,999కు లభిస్తుంది. ఎన్6ఎక్స్ 4జీబీ, 64జీబీ వేరియంట్ రూ.20,999 నుంచి రూ.18,999కు తగ్గి, బ్యాంక్ ఆఫర్‌తో రూ.17,499కు చేరుతుంది. ఎన్6 లైట్ 4జీబీ, 64జీబీ మోడల్ రూ.16,999 నుంచి రూ.15,999కు తగ్గుతుంది. రూ.1వేయి వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో నెట్ ధర రూ.14,999గా ఉంటుంది.

టాబ్లెట్ల ధరలు కూడా తగ్గింపు..
టాబ్లెట్ల విషయానికి వస్తే వన్‌ప్లస్ ప్యాడ్ 4కు చెందిన 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.62,999గానే ఉంటుంది. అయితే ఉచిత స్టైలో ప్రొ లభిస్తుంది. రూ.4,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో నెట్ ఎఫెక్టివ్ ధర రూ.58,499గా ఉంటుంది. వన్‌ప్లస్ ప్యాడ్ గో2కు చెందిన 8జీబీ, 128జీబీ మోడల్ రూ.29,999కే లభించడంతోపాటు ఉచిత గో2 స్టైలో అందుతుంది. రూ.1,500 వరకు డిస్కౌంట్‌తో నెట్ ధర రూ.28,499గా ఉంటుంది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రూ.24,999 నుంచి రూ.22,999కు తగ్గనుంది. ఆడియో ఉత్పత్తుల్లో వన్‌ప్లస్ బడ్స్ ప్రొ 3 రూ.12,999 నుంచి రూ.10,999కు తగ్గుతుంది. రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.8,999కు పొందవచ్చు. వన్‌ప్లస్ బడ్స్ 4 రూ.6,499 నుంచి రూ.5,899కు తగ్గి, రూ.500 డిస్కౌంట్‌తో రూ.5,399కు లభిస్తుంది. నార్డ్ బడ్స్ 4 ప్రొ రూ.4,299 నుంచి రూ.3,899కు తగ్గి, రూ.300 డిస్కౌంట్‌తో రూ.3,599కు చేరుతుంది.
ఆడియో ఉత్పత్తులు సైతం..
నార్డ్ బడ్స్ 4 రూ.3,299 నుంచి రూ.2,899కు తగ్గి, రూ.200 డిస్కౌంట్‌తో రూ.2,699కు లభిస్తుంది. నార్డ్ బడ్స్ 3ఆర్ రూ.1,999 నుంచి రూ.1,699కు తగ్గి, రూ.100 డిస్కౌంట్‌తో రూ.1,599కు లభిస్తుంది. బుల్లెట్స్ వైర్‌లెస్ జడ్3 రూ.1,999 నుంచి రూ.1,599కు తగ్గి, రూ.200 డిస్కౌంట్‌తో రూ.1,399కు చేరుతుంది. బుల్లెట్స్ వైర్‌లెస్ జడ్2 ఏఎన్‌సీ రూ.2,299 నుంచి రూ.2,099కు తగ్గి, రూ.100 డిస్కౌంట్‌తో రూ.1,999కు లభిస్తుంది. ఫ్లాగ్‌షిప్ విభాగంలో వన్‌ప్లస్ 15లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్లాట్‌ఫామ్ ఉంటుంది. వన్‌ప్లస్ 15ఆర్‌లో 165 హెడ్జ్ డిస్‌ప్లే, 7,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. కాంపాక్ట్ మోడల్‌గా వన్‌ప్లస్ 13ఎస్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ మూడు మోడళ్లకు 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

నార్డ్ సిరీస్ కొత్త ఫోన్లు ఎలా ఉన్నాయి..
నార్డ్ సిరీస్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6కు 165 హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. నార్డ్ సీఈ6లో 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 144 హెడ్జ్ ప్యానెల్ ఉన్నాయి. నార్డ్ సీఈ6 లైట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఏపెక్స్ ప్రాసెసర్, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఎంపిక చేసిన కార్డుదారులకు ఈ సిరీస్‌లో 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తుంది. బడ్జెట్ ఎన్ సిరీస్‌లో ఎన్6కు 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఎన్6ఎక్స్‌లో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఎన్6ఎక్స్‌కు కొత్తగా 6జీబీ, 128జీబీ వేరియంట్‌ను అక్టోబర్ 8న సేల్ ప్రారంభంతోపాటు విడుదల చేయనున్నారు. ఈ సిరీస్‌లో 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంటుంది.
ఆఫ్‌లైన్‌లో ఎలా..
టాబ్లెట్, ఆడియో విభాగాల్లోనూ ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ప్యాడ్ 4, ప్యాడ్ గో2 బండిళ్లతోపాటు ప్రచార కాలంలో ఉచిత స్టైలస్‌లను అందించనున్నారు. ఆడియో విభాగంలో ఎంట్రీ లెవల్ నార్డ్ బడ్స్ 3ఆర్‌కు జేడ్ మిస్ట్ కలర్ ఆప్షన్‌ను పరిచయం చేయనున్నారు. బడ్స్ ప్రొ 3, నార్డ్ బడ్స్ 4 సిరీస్, బుల్లెట్స్ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌లపై కూడా ఆఫర్లు ఉంటాయి. భౌతికంగా ఈ ఉత్పత్తులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోని వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లతోపాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి రిటైల్ చైన్లలో అందుబాటులో ఉంటాయి. అమెజాన్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఫ్లిప్‌కార్ట్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్ కార్డులతో బ్యాంక్ డిస్కౌంట్లు వర్తిస్తాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
- ●Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే
- ●Telangana Congress | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీలకు ఇవ్వండి

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?






