త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Chirumalla Rakhesh Kumar | ఉస్మానియాకు వెయ్యి కోట్లు, చాక‌లి ఐల‌మ్మ యూనివ‌ర్సిటీకి ఇస్తామ‌న్న రూ.500 కోట్లు ఏమ‌య్యాయ‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్‌ చిరుమళ్ల రాకేశ్ కుమార్ నిల‌దీశారు.

S

Telangana | Published On Oct 3, 2026, 5.26 pm IST

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
Advertisement
  • యూనివ‌ర్సిటీల‌కు పేర్లు పెట్ట‌డం త‌ప్పా ఐదు పైస‌లు కూడా ఇవ్వ‌లే
  • వెంట‌నే నిధులివ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తాం
  • కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్‌ చిరుమళ్ల రాకేశ్ కుమార్ హెచ్చ‌రిక‌

Chirumalla Rakhesh Kumar | త్రినేత్ర న్యూస్‌: ఉస్మానియాకు వెయ్యి కోట్లు, చాక‌లి ఐల‌మ్మ యూనివ‌ర్సిటీకి ఇస్తామ‌న్న రూ.500 కోట్లు ఏమ‌య్యాయ‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్‌ చిరుమళ్ల రాకేశ్ కుమార్ నిల‌దీశారు. రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు పేర్లు పెట్టడం తప్ప రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల తరహాలో ఓయూ ఏమ‌వుతుందో అనే భ‌యం నెల‌కొంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు. ఓయూ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు ఇస్తామని 2025, డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 500 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కానీ ఐదు పైసలు కూడా ఇవ్వకుండా కాగితాలు చేతిలో పెడితే ఎలా? ఓయూ విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం 200 కోట్లు కూడా ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు పేర్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు.

ఫీజ్ రీఎంబర్స్ మెంట్, మెస్ బకాయిలు కూడా రావడం లేదు. ఎఫ్‌డీల వడ్డీలతో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. లేదంటే బీఆర్ఎస్, విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని రాకేశ్ కుమార్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement