Arms Theft Case | మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీలో విస్తుపోయే విషయాలు..!
Arms Theft Case | మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మల్లేశ్‌ను పది రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అతడి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగా కీలక వివరాలను రాబట్టినట్లు తెలిసింది.
Arms Theft Case | మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మల్లేశ్‌ను పది రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అతడి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగా కీలక వివరాలను రాబట్టినట్లు తెలిసింది. 2009లో ఆర్మీలో చేరిన మల్లేష్‌కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఏ కంటోన్మెంట్‌లో విధులు నిర్వహించినా ఆయుధాగారం బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలుమార్లు ఉన్నతాధికారుల క్రమశిక్షణ చర్యలకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.
2022లో అక్రమ ఆయుధాల వ్యాపారితో పరిచయం
2022లో కలకత్తా బ్యారక్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ ఆయుధాల వ్యాపారి అవల్ దెయ్ అలియాస్ ఓబీతో మల్లేష్‌కు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. బీర్బల్ షా ద్వారా అవల్ దెయ్‌ను పరిచయం చేసుకున్న మల్లేశ్.. అతడి నుంచి రూ.10వేలకు ఓ తుపాకీ కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే, మల్లేశ్‌కు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు దర్యాప్తులో తెలిసింది. 2007లో ఆమ్రాబాద్, అచ్చంపేట ప్రాంతాల్లో నమోదైన ఇళ్ల దొంగతనాల కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వెబ్‌సిరీస్‌ల ప్రేరణతో..
2025లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆర్మీ ఆయుధాలను చోరీ చేయాలనే ఆలోచన మల్లేశ్‌కు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెబ్‌సిరీస్‌లు, బ్యాంకులు, బంగారు దుకాణాల దోపిడీలకు సంబంధించిన వీడియోలు చూసి చోరీకి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. జూలై 2026లో సికింద్రాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు, జవాన్ల కదలికలను పరిశీలిస్తూ చోరీకి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శేషులు, ప్రవీణ్, వినోద్ సహకారం తీసుకున్నట్లు సమాచారం.
యాక్టివా, బ్రీజాలో ఆయుధాల తరలింపు
చోరీ చేసిన ఆయుధాలను యాక్టివా, బ్రీజా కారులో తరలించిన మల్లేశ్.. వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన ఇంట్లో దాచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కోల్‌కతాకు చెందిన బీర్బల్ షా ద్వారా అవల్ దెయ్ అలియాస్ ఓబీకి ఆయుధాలను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. బీర్బల్ షాకు బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చే వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీర్బల్ షా, అవల్ దెయ్ అలియాస్ ఓబీకి దేశవ్యాప్తంగా అక్రమ ఆయుధాల నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Raashi Khanna | ధర్మన్ కోసం రెమ్యూనరేషన్ డబుల్ చేసిన రాశీఖన్నా
- ●Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ - హాట్ ఫొటోలతో షేక్
- ●K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్
- ●Gutka Manufacturing Unit | ఇంట్లో గుట్కా తయారీ కేంద్రం.. గుట్టురట్టు చేసిన పోలీసులు
- ●TG PRC | పీఆర్సీ అమలుపై నీలినీడలు
- ●B. Narsing Rao | తెలంగాణ దర్శకుడు బీ నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్

Raashi Khanna | ధర్మన్ కోసం రెమ్యూనరేషన్ డబుల్ చేసిన రాశీఖన్నా

Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ - హాట్ ఫొటోలతో షేక్

K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్

Gutka Manufacturing Unit | ఇంట్లో గుట్కా తయారీ కేంద్రం.. గుట్టురట్టు చేసిన పోలీసులు




