Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
Aman Sehrawat | భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. నాగోయా సిటీ ఇనాయ్ స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ హాన్ చోంగ్ సాంగ్‌పై 11-7తో విజయం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌లో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకం అందించాడు.
Aman Sehrawat | భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. నాగోయా సిటీ ఇనాయ్ స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ హాన్ చోంగ్ సాంగ్‌పై 11-7తో విజయం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌లో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకం అందించాడు. ఫైనన్ పోరును అమన్ అద్భుతంగా ఆరంభించాడు. ఒక దశలో 6-1తో ఆధిక్యంలో నిలిచాడు. ఒక దశలో హాన్ చోంగ్ సాంగ్ పుంజుకున్నాడు. వరుసగా రెండేసి పాయింట్లు సాధిస్తూ స్కోరును 7-6కు తీసుకొచ్చాడు. ఈ దశలోనూ అమన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. కీలక సమయంలో టేక్‌డౌన్‌తో రెండు పాయింట్లు, రోల్‌తో మరో రెండు పాయింట్లు సాధించి 10-7తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ పాయింట్లపై ఉత్తర కొరియా రెజ్లర్ ఛాలెంజ్ చేశాడు. ఆ అప్పీల్ తిరస్కరణకు గురికావడంతో అమన్‌కు మరో పాయింట్ లభించింది. దీంతో స్కోరు 11-7కు చేరింది. చివరి 30 సెకన్లలో అమన్ అద్భుతంగా డిఫెన్స్ చేసి విజయాన్ని నమోదు చేశాడు.
సెమీస్‌లోనూ సత్తా
ఫైనల్‌కు చేరే క్రమంలో అమన్ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన యమటో ఒగావాను 20-9తో టెక్నికల్ సుపీరియారిటీతో ఓడించాడు. క్వార్టర్‌ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన నుర్దనత్ ఐతనోవ్‌పై 12-1తో ఘన విజయం సాధించాడు. సెమీఫైనల్లో తజికిస్థాన్‌కు చెందిన అయాల్ బెలోల్యుబ్‌స్కీతో తలపడ్డ అమన్ తొలి రౌండ్ ముగిసేసరికి 2-6తో వెనుకబడ్డాడు. అయితే రెండో రౌండ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. 12 పాయింట్లు సాధించి కేవలం రెండు పాయింట్లు మాత్రమే ప్రత్యర్థికి ఇచ్చాడు. చివరకు 14-8తో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అమన్ ఇప్పటికే ఒలింపిక్ పతక విజేత. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడు. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ కాంస్యంతో మెరిశాడు. తాజాగా 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి తన ఆసియా క్రీడల్లోనూ పతకం నెగ్గాడు.
1978 తర్వాత తొలిసారి..
అమన్ గెలిచిన స్వర్ణం మరో ప్రత్యేక ఘనతను సొంతం చేసుకుంది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్‌లో భారత్‌కు సుజీత్ కల్కల్ స్వర్ణ పతకం అందించాడు. తజికిస్థాన్‌కు చెందిన అబ్దుల్మజీద్ కుడియేవ్‌పై 10-9తో విజయం సాధించాడు. ఒక దశలో 2-9తో వెనుకబడిన సుజీత్.. చివరి దశలో వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. అమన్ స్వర్ణంతో కలిపి ఆసియా క్రీడల్లో పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్ ఒకే క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. 1978 తర్వాత భారత్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే
- ●Telangana Congress | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీలకు ఇవ్వండి

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?

OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..





