Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
Harish Rao | కళ్లెదుట గోదావరి నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. నీళ్లు పారితే ప్రజలకు కేసీఆర్ గుర్తొస్తాడని కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు.
- నీళ్లు పారితే ప్రజలకు కేసీఆర్ గుర్తొస్తడని కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తలేరు
- బాండ్ పేపర్ కు ఉండే ఇజ్జత్ కూడా కాంగ్రెస్ వాళ్లు తీసేశారు
- కేసీఆర్ హయాంలో నర్సాపూర్-మెదక్ డబుల్ లైన్ వేసింది మనం చూశాం
- మనుషులే లేని ఫ్యూచర్ సిటీకి 10 వేల కోట్లు ఎందుకు?
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపాటు
Harish Rao | త్రినేత్ర న్యూస్: కళ్లెదుట గోదావరి నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. నీళ్లు పారితే ప్రజలకు కేసీఆర్ గుర్తొస్తాడని కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు. శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నా కల్వకుర్తి మోటార్లను 8 గంటలే నడుపుతున్నారన్నారు. సమ్మక్క బ్యారేజీలో నీళ్లున్నా దేవాదుల మోటార్లను కూడా 8 గంటలే నడుపుతున్నారని ఫైరయ్యారు. ఇది కాలం తెచ్చిన కరువు ఎట్లయితదని నిలదీశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కాగజ్ మద్దూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సాధారణంగా ఎవరైనా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వెళ్తారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆ పార్టీ ఖాళీ అవుతోందంటే వారి పని అయిపోయిందని అర్థం. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ చేతలు గడప దాటడం లేదని ప్రజలకు అర్థమైపోయింది. ఊళ్లలో కాంగ్రెస్ వాళ్లమని చెప్పుకోవడానికే నాయకులు భయపడుతున్నారు. కేసీఆర్ వేసిన రోడ్లకు గుంతలు పడితే కనీసం డాంబర్ వేసి పూడ్చే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. కాగజ్ మద్దూర్ రోడ్లకు మోకాలి లోతు గుంతలు పడి గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజల రోడ్లకు గుంతలు పూడ్చమంటే పైసలు లేవంటారు కానీ.. మనుషులు, ఊరు, వాడ లేని ఫ్యూచర్ సిటీ దగ్గర మాత్రం పదివేల కోట్లు పెట్టి ఆరు వరుసల రోడ్లు వేస్తున్నారు.
గుంతల రోడ్ల మీద లేదా?
నీ అనుయాయుల భూముల ధరలు పెంచుకోవడానికేనా ఈ ఫ్యూచర్ సిటీ రోడ్లు అని రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా. నీ ఇంటెలిజెన్స్ ఎంతసేపు ప్రతిపక్షాల మీదేనా? ఈ గుంతల రోడ్ల మీద లేదా? మంత్రుల నియోజకవర్గాల్లోనే రోడ్లకు దిక్కులేదని ప్రజలు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నర్సాపూర్-హైదరాబాద్, నర్సాపూర్-మెదక్ రోడ్లను ఎంత అద్భుతంగా డబుల్ లైన్ చేశారో అందరూ చూశారు. కేసీఆర్ కట్టించిన దావఖానాలను నిర్వీర్యం చేశారు. నర్సాపూర్ ఆసుపత్రికి వెళ్తే కనీసం అయోడిన్, టీటీ ఇంజెక్షన్ కూడా లేదు, స్టిచ్చింగ్ మెటీరియల్ కూడా బయట కొనుక్కోమంటున్నారు.
ఎన్నికల ముందు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఊరూరు తిరిగారు. వంద రోజులు పోయి వెయ్యి రోజులు దాటుతున్నా ఆ బాండ్ పేపర్లకు దిక్కులేదు. బాండ్ పేపర్ కు ఉండే ఇజ్జత్ కూడా కాంగ్రెస్ వాళ్లు తీసేశారు. బాండ్లను బొందపెట్టి, గ్యారెంటీలకు గోరీ కట్టారు. అవ్వలకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. పెంపు లేదు సరికదా నెలకు 2 వేల చొప్పున లెక్కేసుకున్నా 34 నెలలకు ఒక్కో అవ్వకు రేవంత్ రెడ్డి రూ. 68 వేలు బాకీ పడ్డాడు. కాంగ్రెస్ వాళ్లు కనబడితే అవ్వలు ఆ బాకీ డబ్బులు నిలదీసి అడగాలి.
వెనుక మడి ఎండుతోంది..
రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామని చెప్పి, కేసీఆర్ ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకుండా మూడు సీజన్ల పాటు ఎగ్గొట్టి రైతులను నట్టేట ముంచారు. తడిగుడ్డతో గొంతు కోసే రకం రేవంత్ రెడ్డి అని ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారు. రామాయంపేట రైతులు నాకు ఫోన్ చేసి.. కరెంటు లేక పంటలు ఎండుతున్నాయని, మోటార్లు కాలుతున్నాయని రోడ్డెక్కి ధర్నా చేస్తున్నామని, అక్కడికి రమ్మని పిలిచారు. బాయికాడ పని చేసుకోవాల్సిన రైతులు సబ్‌స్టేషన్ల ముంగట రోడ్లెక్కి ధర్నా చేసే దౌర్భాగ్య పరిస్థితిని ఈ కాంగ్రెస్ తెచ్చింది. బాయికాడ ఆరు, ఏడు గంటల కరెంటు కూడా నిండుగా రావడం లేదు. గంటకోసారి ట్రిప్ అవుతోంది, వెనుక మడి ఎండుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కన్నెపల్లిలో మోటార్లు ఆన్ చేస్తే మా నర్సాపూర్, మంజీరాకు పుష్కలంగా గోదావరి నీళ్లు వస్తాయి.
ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏప్రిల్, మే నెలల మండుటెండల్లో కూడా 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చారు. రూ. 4500 కడితే వ్యవసాయ కనెక్షన్ ఇచ్చారు, కాలిపోయిన వెంటనే కొత్త ట్రాన్స్ ఫార్మర్ తెచ్చి పెట్టారు. కాంగ్రెస్ వచ్చాక వ్యవసాయ కనెక్షన్ డిపాజిట్ చార్జీలు రూ. 10 వేలకు పెంచారు. కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఇవ్వడానికి రోలింగ్ స్టాక్ లేదు. లంచం ఇస్తే తప్ప ట్రాన్స్ ఫార్మర్ రాని పరిస్థితి దాపురించింది. కరెంటు కోతలకు ఎల్ నినో కారణమని కాంగ్రెస్ కుంటిసాకులు చెబుతోంది. ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కోత.
ఆరు, ఏడు నెలల ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా ముందస్తుగా బొగ్గు నిల్వ చేసుకోకుండా, ఒప్పందాలు చేసుకోకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు నాటకాలు ఆడుతున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కేసీఆర్ కరెంటు ఆపలేదు, రైతుబంధు ఆపలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కరోనా కంటే డేంజర్ గా తయారైంది. మన రాష్ట్రంలో కరెంటుకు దిక్కులేదు కానీ.. కేసీఆర్ ఎంతో ముందుచూపుతో నిర్మించిన సింగరేణి థర్మల్ ప్లాంట్ 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు అమ్ముకోవడానికి జాయింట్ వెంచర్ చేసుకున్నారు. తెలివి ఉన్నోడు ఎవడైనా ఈ పని చేస్తాడా? దీన్ని వెంటనే రద్దు చేసి ఆ కరెంటు మనకే వాడుకోవాలని నేను లేఖ రాశాను.
పాత రోజులంటే ఏమో అనుకున్నం..
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని నేను ఆరు నెలల క్రితమే బయటపెట్టాను. వాస్తవాలు చూపిద్దామని నేను రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లి వెళ్తుంటే నన్ను అడుగడుగునా పోలీసులు అరెస్టు చేశారు. నేడు బొగ్గు లేక కొత్తగూడెం, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లలో సుమారు 2500 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. రేవంత్ రెడ్డి పాత రోజులు తెస్తానంటే ఏమో అనుకున్నాం.. కరెంటు లేక బాయి కాడ పండుకునే రోజులు, ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట చెప్పులు లైన్లో పెట్టే పాత కష్టాలను మళ్లీ తెచ్చాడు.
కేసీఆర్ కట్టించిన దావఖానాలను నిర్వీర్యం చేశారు. నర్సాపూర్ ఆసుపత్రికి వెళ్తే కనీసం అయోడిన్, టీటీ ఇంజెక్షన్ కూడా లేదు, స్టిచ్చింగ్ మెటీరియల్ కూడా బయట కొనుక్కోమంటున్నారు. ఆడబిడ్డలకు భరోసా ఇచ్చిన కేసీఆర్ కిట్ బంద్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కన్నెపల్లిలో మోటార్లు ఆన్ చేస్తే మా నర్సాపూర్, మంజీరాకు పుష్కలంగా గోదావరి నీళ్లు వస్తాయి. అన్నారం, సుందిల్ల బ్యారేజీలు సురక్షితంగా ఉన్నాయని నివేదికలు వచ్చాయి. నీళ్లు వాడుకోవచ్చని ఎన్‌డీఎస్‌ఏ కూడా హైకోర్టుకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. కళ్ల ముంగట నీళ్లున్నా ఎత్తకపోతే ఇది కాలం తెచ్చిన కరువు ఎలా అవుతుంది?
నీళ్లుంటే పంట పండుతుంది, పంట పండితే యూరియా ఇవ్వాలి, చేతికొచ్చాక వడ్లు కొనాలి.. ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే నీళ్లు, కరెంటు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. కొమురవెల్లి మల్లన్న, భద్రాద్రి రామయ్య, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, ఏడుపాయల అమ్మవారు, మెదక్ చర్చి మీద ఒట్లు పెట్టి ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి.. దేవుళ్లను సైతం మోసం చేసిన ఘరానా మోసగాడు ఈ రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
అక్టోబర్ 3, 2026

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
అక్టోబర్ 3, 2026

Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు
- ●Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..
- ●Gym Trainer Arrest | యువతి అశ్లీల ఫొటో వాట్సాప్‌లో షేర్.. జిమ్ ట్రైనర్ అరెస్ట్
- ●Dulquer Salmaan | తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ - ఒకే రోజు థియేటర్లలోకి మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎంలు అక్రమంగా ఎన్నికయ్యారు.. లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి
- ●Amit Shah BNS Statement | ఎఫ్ఐఆర్ నుంచి సుప్రీంకోర్టు తీర్పు దాకా.. మూడేళ్లలోనే కేసు క్లోజ్: అమిత్ షా సంచలన ప్రకటన

Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు

Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..

Gym Trainer Arrest | యువతి అశ్లీల ఫొటో వాట్సాప్‌లో షేర్.. జిమ్ ట్రైనర్ అరెస్ట్

Dulquer Salmaan | తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ - ఒకే రోజు థియేటర్లలోకి మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు



