త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nursing Jobs | జ‌ర్మ‌నీలో న‌ర్సింగ్ ఉద్యోగ అవ‌కాశం.. ద‌ర‌ఖాస్తులు కోరుతున్న TOMCOM

Nursing Jobs | రాష్ట్రానికి చెందిన న‌ర్సింగ్ అభ్య‌ర్థుల‌కు (Nursing Jobs0 విదేశాల్లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. జ‌ర్మ‌నీలోని (Germany) ప్ర‌ముఖ ద‌వాఖాన‌ల్లో ఉద్యోగాల కోసం అర్హ‌త క‌లిగిన న‌ర్సింగ్ సిబ్బంది నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను తెలంగాణ ఓవ‌ర్సీస్ మ్యాన్‌ప‌వ‌ర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఆహ్వానిస్తున్న‌ది.

G

Telangana | Published On May 19, 2026, 8.54 am IST

Nursing Jobs | జ‌ర్మ‌నీలో న‌ర్సింగ్ ఉద్యోగ అవ‌కాశం.. ద‌ర‌ఖాస్తులు కోరుతున్న TOMCOM
Advertisement

Nursing Jobs | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రానికి చెందిన న‌ర్సింగ్ అభ్య‌ర్థుల‌కు (Nursing Jobs0 విదేశాల్లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. జ‌ర్మ‌నీలోని (Germany) ప్ర‌ముఖ ద‌వాఖాన‌ల్లో ఉద్యోగాల కోసం అర్హ‌త క‌లిగిన న‌ర్సింగ్ సిబ్బంది నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను తెలంగాణ ఓవ‌ర్సీస్ మ్యాన్‌ప‌వ‌ర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఆహ్వానిస్తున్న‌ది. ఎంపికైన వారికి ప్ర‌తినెల సుమారు రూ.2.3 నుంచి రూ.2.6 లక్షలు (2,300 యూరోలు) అందుకోవ‌చ్చు. గుర్తింపు త‌ర్వాత నెల‌కు సుమారు రూ.3 ల‌క్ష‌లు (2,800 యూరోలు) ఉంటుంది. అద‌నంగా ఓవ‌ర్‌టైమ్ అల‌వెన్స్ 20 నుంచి 30 శాతం ఉంటుంది. వారానికి 38 నుంచి 40 గంట‌లు ప‌నిచేయాల్సి ఉంటుంది.

అర్హ‌త‌లు, ఎంపిక విధానం..

  • గుర్తింపు పొందిన కళాశాలల నుంచి బీఎస్సీ న‌ర్సింగ్‌, పోస్ట్ బేసిక్ బీఎస్సీ, జీఎన్‌ఎం పూర్తిచేయాలి. అభ్య‌ర్థులు 22 నుంచి 38 ఏండ్ల‌లోపువారై ఉండాలి.
  • జీఎన్‌ఎం అభ్యర్థులకు కనీసం మూడేండ్ల‌ అనుభవం ఉండాలి. ఇండియన్‌ నర్స్‌ రిజిస్ట్రేషన్ స‌ర్టిఫికెట్‌ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు. పాలియేటివ్‌ కేర్‌ (హోంకేర్, నర్సింగ్‌ హోం) ఇన్‌పేషెంట్, హాస్పిట‌ళ్ల‌లో నర్సింగ్‌ అనుభవం ఉండాలి.
  • ఫ్రెష‌ర్స్ కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే అనుభ‌వం ఉన్న‌వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
  • దరఖాస్తుదారులకు ప్రాథమిక ఇంటర్వ్యూ సమయంలో జర్మన్‌ భాషా పరిజ్ఞానం అవసరం లేదు. ఎంపికైనవారికి ఆ భాషపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

  • శిక్షణ మొదలైన ఆరు నెలల్లో ఏ-2 స్థాయిలో 70 మార్కులు పొందినవారిని కొనసాగిస్తారు. అర్హత సాధించినవారికి మరో దశ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. బీ1 జర్మన్‌ ధ్రువీకరణ కలిగిన వారికి ఫాస్ట్‌ట్రాక్‌ కార్యక్రమంలో పరిగణిస్తారు. ఎంపికైన వారికి విమాన ఖ‌ర్చులు, వీసా స‌హాయం, ఫ్యామిలీ వీసా అందిస్తారు.
  • చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, మెడికల్‌గా ఫిట్‌గా ఉండి ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేకుండా ఉండాలి. జర్మన్ సంస్కృతికి అలవాటు పడేందుకు సిద్ధంగా ఉండాలి.

మరిన్ని వివరాలకు 94400 51581, 94400 52081, 9440049645 నంబర్లను సంప్ర‌దించ‌వ‌చ్చు. అదేవిధంగా టాంకాం తెలంగాణ వెబ్‌సైట్‌గానీ సందర్శించి తెలుసుకోవచ్చు.

ద‌ర‌ఖాస్తుల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Advertisement
Advertisement