Komatireddy Venkat Reddy’s Financial Assistance | కోమటిరెడ్డి మళ్లీ సాయం చేశారు.. గుండె లోతుల్లోంచి కృతజ్ఞతలు చెబుతున్నా.. జర్మనీ నుంచి విద్యార్థిని ఎమోషనల్
Komatireddy Venkat Reddy's Financial Assistance | ఉన్నత చదువల కోసం వెళ్లి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనను మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆదుకున్నారని జర్మనీ(Germany)లో ఉన్న విద్యార్థిని పరిమళ (Parimala) ఏమోషనల్ అయింది.
Flash news | Published On Nov 27, 2026, 6.05 pm IST
Komatireddy Venkat Reddy's Financial Assistance | త్రినేత్ర న్యూస్: ఉన్నత చదువల కోసం వెళ్లి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనను మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆదుకున్నారని జర్మనీ(Germany)లో ఉన్న విద్యార్థిని పరిమళ (Parimala) ఏమోషనల్ అయింది. ఇప్పుడు మరోసారి రూ.6 లక్షలు అందించి గొప్ప మనసును చాటుకున్నారని కొనియాడింది. తన గుండె లోతుల్లోంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నది. దేవరకొండకు చెందిన ఆమె శుక్రవారం ఓ వీడియో సందేశం రిలీజ్ చేసింది.
గతంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షలు అందించారు. చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జర్మనీ వెళ్లిన తర్వాత డాక్యుమెంటేషన్ సమస్యలతో యూనివర్సిటీ ఎన్‌రోల్‌మెంట్ (University Enrollment) నిలిచిపోయింది. ఎక్స్‌పాట్రియో బ్యాంక్ ఖాతా బ్లాక్ కావడంతో నా డబ్బులు తీసుకోలేక రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొన్నా.
ఈ పరిస్థితుల్లో నా సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వెంటనే స్పందించి మరో రూ.6 లక్షలు అందించారు. పత్రాల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు నాకు ఎంతో ఉపయోగపడతాయి. కష్టకాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని అండగా నిలిచిన వెంకట్‌రెడ్డి మనసు ఎంతో గొప్పది అని ఆమె కొనియాడింది.
Deeply moved by these kind words from Parimala, who is pursuing her higher studies in Germany.
Through the #KomatireddyPrateekReddyFoundation, our commitment to deserving students does not end with initial funding it means standing beside them through every challenge.
After initially supporting her education with ₹10 lakhs, we learned that unexpected documentation delays in Germany had temporarily blocked access to her funds. To ensure she could continue her studies without worry, we immediately extended an additional ₹6 lakhs in assistance.
Education has the power to transform families and uplift generations. To every young student with determination and big dreams work hard, stay focused, and know that we will always stand by you.
Wishing Parimala great success ahead.— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) November 27, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






