TOMCOM | ఖతార్‌లో నర్సు ఉద్యోగాలు.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న TOMCOM
TOMCOM | విదేశాల్లో ఆరోగ్య సంరక్షణ రంగంలో (Healthcare) ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్న నర్సులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) గుడ్ న్యూస్ చెప్పింది.
TOMCOM | త్రినేత్ర న్యూస్: విదేశాల్లో ఆరోగ్య సంరక్షణ రంగంలో (Healthcare) ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్న నర్సులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) గుడ్ న్యూస్ చెప్పింది. కార్మిక శాఖకు చెందిన ఈ సంస్థ ద్వారా అర్హత కలిగిన లైసెన్స్డ్ ప్రాక్ట్రీషనర్ నర్సులు (LPN), నర్స్ టెక్నీషియన్లకు (Nurse Technicians) ఖతార్‌లో (Qatar) ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో కెరీర్‌ను నిర్మించుకోవాలని భావిస్తున్న వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఎల్ఎన్పీ, Nurse Technicians ఉద్యోగాల కోసం అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని TOMCOM సూచించింది. నర్స్ టెక్నీషియన్స్‌కు ఏడాది, లైసెన్సుడు ప్రాక్ట్రీషియనర్స్కు రెండేండ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలని, సంబంధిత క్లినికల్ స్కిల్స్, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండాలని తెలిపింది. ఎంపికైన నర్స్ టెక్నీషియన్స్‌కు ప్రతినెల రూ.73,000, ఎల్ఎన్పీలకు రూ.95,000 జీతం అందుకోవచ్చు.
అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ వీసా, విమాన టికెట్, వసతి, రవాణా, మెడికల్ ఇన్సూరెన్స్ వంటివి ఉచితంగానే అందిస్తారని తెలిపింది. మరిన్ని వివరాలకోసం 08035524946 నంబర్లో సంప్రదించవచ్చని, అభ్యర్థులు తమ రెజ్యూమేలను tomcomglobal@gmail.com. ఇ-మెయిల్ చేయాలని తెలిపింది.

పూర్తి వివరాలకు వెబ్సైట్: https://tomcom.telangana.gov.in/
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Samajwadi Party | అఖిలేశ్‌కు షాక్.. నేడు బీజేపీలో చేరనున్న ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు
- ●Pope Leo | పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీ విజయవంతం
- ●Navaratri Brahmotsavam | బ్రహ్మోత్సవాల వేళ.. సప్తగిరుల ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
- ●Traffic Restrictions | నేడు భారత్-వెస్టిండీస్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- ●Navaratri Brahmotsavam Special | 157 దేశాల కరెన్సీతో వెంకన్న హుండీ కళకళ!
- ●Boat Capsizes | గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి

Samajwadi Party | అఖిలేశ్‌కు షాక్.. నేడు బీజేపీలో చేరనున్న ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు

Pope Leo | పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీ విజయవంతం

Navaratri Brahmotsavam | బ్రహ్మోత్సవాల వేళ.. సప్తగిరుల ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Traffic Restrictions | నేడు భారత్-వెస్టిండీస్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు






