Vivek Venkata Swamy | తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
Vivek Venkata Swamy | తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkata Swamy) అన్నారు.
Vivek Venkata Swamy | త్రినేత్ర న్యూస్: తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkata Swamy) అన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి జర్మనీ(Germany)లో ఉద్యోగ (Employment) అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. జర్మనీ లోయర్ సాక్సనీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒలాఫ్ లీస్, జర్మనీ రాయబారి డాక్టర్ జాస్పర్ వీక్ తదితరులతో కలిసి మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన టాలెంట్ మొబిలిటీ రౌండ్ టేబుల్ సమావేశం (Talent Mobility Round Table Meeting)లో పాల్గొన్నట్లు చెప్పారు. నైపుణ్య భాగస్వామ్యానికి ముందడుగు వేసినట్లు పేర్కొన్నారు.
300 ఐటీఐలు..
తెలంగాణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి, జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై చర్చించాను. రాష్ట్రంలో 300 ఐటీఐలు, టాటా టెక్నాలజీస్ సహకారంతో 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 54 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.
రూ.50 కోట్లు కేటాయించాం..
అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను బలోపేతం చేసేందుకు TOMCOMలో లోయర్ సాక్సనీ కార్యాలయం ఏర్పాటుకు సహకరిస్తామని తెలియజేశాను. యువత నైపుణ్యాభివృద్ధి, విదేశీ ఉపాధికి సీఎం ఓవర్సీస్ పథకం కింద రూ.50 కోట్లు కేటాయించాం అని వివేక్ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సందడి.. హోటల్లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు
నవంబర్ 24, 2026

Road Accident | దైవ దర్శనానికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు.. హైదరాబాద్‌కు చెందిన దంపతులు ఎలా చనిపోయారంటే!
నవంబర్ 24, 2026

Ponnam Prabhakar | ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న బీజేపీ: మంత్రి పొన్నం ప్రభాకర్
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్గా సాయిపల్లవి!
- ●Motorola Edge 70 Neo | మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదుర్స్..
- ●Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
- ●Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సందడి.. హోటల్లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు
- ●SEBI | ఐపీఓ జీఎంపీ ప్రచారానికి సెబీ బ్రేకులు.. మధ్యవర్తులకు కీలక ఆదేశాలు..
- ●Indiramma Towers | ఉచితంగా రిజిస్ట్రేషన్.. ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్గా సాయిపల్లవి!

Motorola Edge 70 Neo | మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదుర్స్..

Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సందడి.. హోటల్లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు





