త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Driving | కారు, బైక్ న‌డప‌డం వ‌చ్చా?.. ఇలా చేస్తే మీకు నెల‌కు రూ.ల‌క్ష జీతం వ‌చ్చిన‌ట్టే..

Driving | మీకు కారు, బైక్ న‌డ‌ప‌డం (Driving) వ‌చ్చా?.. మీరు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో మంచి అవ‌కాశం. డ్రైవింగ్ చేస్తూ నెల‌కు ల‌క్ష రూపాయ‌ల‌కుపైగానే సంపాదించ‌వ‌చ్చు. ఎక్క‌డ అనుకుంటున్నారా?.. దుబాయ్‌లో (Dubai).

G

Telangana | Published On Jun 13, 2026, 9.18 am IST

Driving | కారు, బైక్ న‌డప‌డం వ‌చ్చా?.. ఇలా చేస్తే మీకు నెల‌కు రూ.ల‌క్ష జీతం వ‌చ్చిన‌ట్టే..
Advertisement

Driving | త్రినేత్ర‌.న్యూస్‌: మీకు కారు, బైక్ న‌డ‌ప‌డం (Driving) వ‌చ్చా?.. మీరు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో మంచి అవ‌కాశం. డ్రైవింగ్ చేస్తూ నెల‌కు ల‌క్ష రూపాయ‌ల‌కుపైగానే సంపాదించ‌వ‌చ్చు. ఎక్క‌డ అనుకుంటున్నారా?.. దుబాయ్‌లో (Dubai). గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్-TOMCOM) ఈ ఉపాధి అవ‌కాశం క‌ల్పిస్తున్నది.

దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. విదేశాల్లో స్థిరపడి మంచి ఆదాయం సంపాదించుకోవాల‌నుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. క్యాబ్ డ్రైవర్లుగా ఎంపికైతే నెలకు రూ.2,500 నుంచి 4,000 యూఏఈ దిర్హామ్స్.. అంటే మ‌న‌ కరెన్సీలో సుమారు రూ.64,850 నుంచి రూ.1,03,770 వరకు సంపాదించుకునే అవ‌కాశం. బైక్ రైడర్లకు నెలకు గరిష్టంగా 2,500 దిర్హామ్స్ (సుమారు రూ.64,850) వరకు వ‌స్తుంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా వంద శాతం కమీషన్ ప్రాతిపదికన ఉంటాయని అధికారులు తెలిపారు. అభ్యర్థి వ్యక్తిగత పనితీరు, పూర్తయిన ట్రిప్పుల సంఖ్య, కంపెనీ నిర్దేశించిన ఆదాయ స్లాబ్ ఆధారంగానే నెలవారీ వేతనం ఆధారపడి ఉంటుందని వెల్ల‌డించారు.

 

దరఖాస్తు చేసుకునేవారి వ‌య‌స్సు క‌చ్చితంగా 23 నుంచి 45 ఏండ్ల‌ మధ్య ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అనుభవం త‌ప్ప‌నిస‌రి. స్థానికంగా ప్రయాణికులతో మాట్లాడటానికి కనీస స్థాయి ఇంగ్లీష్ మాట్లాడ‌టం, చదవటం తెలిసి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 25లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసిన అనంతరం.. అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాల పరిశీలిస్తారు. అనంతరం శారీరక దారుఢ్యం, ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయడానికి మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. దుబాయ్ పోలీసుల నుంచి సీఐడీ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవడం అత్యంత కీలకం. వీసా అనుమతులు, రిక్రూటింగ్ కంపెనీ నిబంధనలు, కంపెనీ అవ‌స‌రాల‌ను బ‌ట్టి తుది ఎంపిక ఉంటుందని టామ్‌కామ్ వెల్లడించింది. మ‌రిన్ని వివరాల కోసం అభ్యర్థులు 94400 49520, 94400 48590 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement