Tiger | కొల్లాపూర్‌లో పెద్ద పులి కలకలం.. ఆందోళనలో ఎంగంపల్లి తండా వాసులు
Tiger | రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పులుల సంచారం ఎక్కువైపోతోంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే దిగువన ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా వరకు పెద్ద పులులు ఎక్కడో ఒక చోట దర్శనమిస్తూనే ఉన్నాయి.
Tiger | రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పులుల సంచారం ఎక్కువైపోతోంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే దిగువన ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా వరకు పెద్ద పులులు ఎక్కడో ఒక చోట దర్శనమిస్తూనే ఉన్నాయి. పెద్ద పులులు అడవులను దాటి జనవాసాల్లోకి ప్రవేశించి ఆందోళనకు గురి చేస్తున్నాయి.
తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ సోమశిల సెక్షన్ సరిహద్దుల్లో పెద్ద పులి సంచరిస్తోంది. ఎంగంపల్లి తండాతో పాటు పరిసర ప్రాంంతాల్లో పెద్ద పులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది. పెద్ద పులి కదలికలను గమనించిన తండా వాసులు జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారులు డీఎఫ్‌వో, ఎఫ్‌డీవో, ఎఫ్ఆర్‌వో ఆదేశాల మేరకు కొల్లాపూర్ అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.
ఎంగంపల్లి తండాతో పాటు పరిసర ప్రాంతాలను, అటవీ సరిహద్దు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయ పొలాల్లో కనిపించిన పులి పాదముద్రలను గుర్తించారు. అవి పెద్ద పులి పాదముద్రలే అని అటవీశాఖ అధికారులు కాశన్న, ముజీబ్ నిర్ధారించారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో పర్యాటకులు, తండా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వ్యవసాయ పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్తూ శబ్దాలు చేయాలన్నారు. ఆ అలజడికి పులి పారిపోయే అవకాశం ఉందన్నారు.
సంబంధిత వార్తలు

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
జులై 26, 2026

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
జులై 26, 2026

Rainfall | హైదరాబాద్లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
జులై 26, 2026
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ



