Tiger | సింగరేణి గనుల్లో పెద్ద పులి.. భయాందోళనలో కార్మికులు
Tiger | మంచిర్యాల జిల్లాలోని సింగరేణి గనుల్లో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. పెద్ద పులి సంచారంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో పనులు చేయలేకపోతున్నామని, తీవ్ర ఆటంకం కలుగుతుందని కార్మికులు వాపోయారు.
Tiger | మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని సింగరేణి గనుల్లో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. పెద్ద పులి సంచారంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో పనులు చేయలేకపోతున్నామని, తీవ్ర ఆటంకం కలుగుతుందని కార్మికులు వాపోయారు.
శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 8 గని వద్ద ఓ అంబులెన్స్ డ్రైవర్‌కు పెద్ద పులి కనిపించింది. దీంతో అతను తన స్మార్ట్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలో సింగరేణి అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అటవీ శాఖ అధికారులు ఆర్కే 8 గని వద్దకు చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. పులి సంచారంపై నిఘా పెట్టినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
పులి కదలికలపై కార్మికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సింగరేణి అధికారులు సూచించారు. రెండు, మూడు షిఫ్టుల్లో విధులకు హాజరయ్యే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లొద్దని చెప్పారు. గుంపులు గుంపులుగా విధులకు వెళ్లాలని, ఏదో ఒక శబ్దం చేయాలని సూచించారు. దాంతో పులి ఆ పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశం లేదన్నారు.
రెండు రోజుల క్రితం ఇదే మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలం, జైపూర్ మండలాల పరిధిలో కూడా ఓ రెండు పులులు సంచారం చేశాయి. నర్సింగాపూర్, వెలాల గ్రామ శివార్లలో పులుల సంచారంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వ్యవసాయ కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. మొత్తంగా మంచిర్యాల జిల్లాకు మహారాష్ట్ర నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మీదుగా పులులు ప్రవేశిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు.
సింగరేణి ఓపెన్ గనుల వద్ద పెద్ద పులుల సంచారం
భయాందోళనలు కార్మికులు, హెచ్చరికలు జారీ చేసిన అటవీ శాఖ అధికారులు pic.twitter.com/grV0elWvVD
— Telugu Scribe (@TeluguScribe) December 12, 2025
సంబంధిత వార్తలు

Minister Vivek | సింగరేణికి పూర్వ వైభవం : మంత్రి వివేక్ వెంకటస్వామి
మే 14, 2026

Tummala Nageswara Rao | వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
మే 6, 2026

Mancherial | లక్షెట్టిపేటలో ఈదురుగాలి బీభత్సం.. తండ్రీకొడుకులు సహా నలుగురు దుర్మరణం
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



