త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | సింగ‌రేణి డిపెండెంట్ ఆర్డ‌ర్ల‌ను 15 రోజుల్లో పూర్తి చేస్తాం : డిప్యూటీ సీఎం భ‌ట్టి

Bhatti Vikramarka | సింగ‌రేణి( Singareni )లో 250 నుంచి 300 వ‌ర‌కు ‎పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లో పూర్తి చేసి ఆర్డర్లను అందజేస్తామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క( Bhatti Vikramarka ) తెలిపారు. ‎సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చారు.

S

Telangana | Published On Oct 13, 2026, 1.59 pm IST

Bhatti Vikramarka | సింగ‌రేణి డిపెండెంట్ ఆర్డ‌ర్ల‌ను 15 రోజుల్లో పూర్తి చేస్తాం : డిప్యూటీ సీఎం భ‌ట్టి
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : సింగ‌రేణి( Singareni )లో 250 నుంచి 300 వ‌ర‌కు ‎పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లో పూర్తి చేసి ఆర్డర్లను అందజేస్తామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క( Bhatti Vikramarka ) తెలిపారు. ‎సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చారు. హైద‌రాబాద్‌లోని ప్ర‌జా భ‌వ‌న్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబుతో క‌లిసి భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడారు.
‎
‎మెడికల్ ఇన్వాలిడేషన్ పరీక్షల కోసం ప్రతి ఏరియా ఆసుపత్రిలో నెలవారీ బోర్డు సమావేశాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ‎కరోనా, ఇతర స్థానిక కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు వన్‌టైమ్ ఆప్షన్ కింద తిరిగి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్నారు. ‎సింగరేణి భూముల్లో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. ‎జిల్లా కలెక్టర్లు, సింగరేణి అధికారుల కమిటీ నెల రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ‎సింగరేణి భూముల్లో కార్మికుల గృహ నిర్మాణాలకు నెహ్రూ హౌసింగ్ కాలనీల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ‎శిథిలమైన డి-టైప్ క్వార్టర్ల స్థానంలో అన్ని వసతులతో నూతన నివాస సముదాయాలు నిర్మిస్తున్నామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

కార్డియాక్, క్యాథ్ ల్యాబ్ సేవల ఏర్పాటుకు చర్యలు
‎

‎సింగరేణి ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. ‎నిపుణులైన వైద్యుల నియామకం.. కార్డియాక్, క్యాథ్ ల్యాబ్ సేవల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు. ‎సింగరేణి ప్రాంతంలోని గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. ‎సింగరేణి పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేస్తామ‌న్నారు.

‎సింగరేణి కాలనీల ఆధునీకరణకు ప్రాధాన్యం

‎
‎కమర్షియల్ ప్రాంతాల్లో కాకుండా వినియోగంలో లేని భూములు, ఓబీ గుట్టలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక ర‌చిస్తున్నామ‌ని చెప్పారు. ‎సింగరేణి కాలనీల ఆధునీకరణకు ప్రాధాన్యం ఇవ్వ‌డంతో పాటు మెరుగైన డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు క‌ల్పిస్తామ‌న్నారు. ‎అన్ని సింగరేణి కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామ‌న్నారు.

‎ప్రతి ఆరు నెలలకు కార్మికులకు భద్రతా కిట్ల పంపిణీ

‎
‎ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. భూపాలపల్లిలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు భూమి కేటాయింపుపై చర్యలు తీసుకుంటామ‌న్నారు. ‎ప్రతి ఆరు నెలలకు కార్మికులకు భద్రతా కిట్ల పంపిణీ సక్రమంగా పంపిణీ చేయాల‌న్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం
‎

‎ఎన్నికల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ అమలులో భాగంగా రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‎సింగరేణి కార్మికుల ఆదాయ పన్నును సంస్థ నుంచే ప్రభుత్వానికి చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. ‎సత్తుపల్లి, భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలల మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయింపు చేస్తామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

Advertisement
Advertisement