త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger centipede | క‌వ్వాల్ పులుల సంర‌క్ష‌ణ కేంద్రంలో అరుదైన జెర్రి

Tiger centipede | పులి( Tiger )ని చూస్తే ఎవ‌రికైనా వెన్నులో వణుకుపుడుతోంది. మ‌రి ఆ మాదిరి పోలిన జెర్రిని చూస్తే కూడా ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తోంది. సాధార‌ణంగా న‌లుపు లేదా ముదురు రంగులో ఉండే జెర్రిల‌తో పోల్చితే.. ఈ జెర్రి కాస్త డిఫరెంట్‌గా ఉంది.

S

Telangana | Published On Nov 3, 2026, 6.45 am IST

Tiger centipede | క‌వ్వాల్ పులుల సంర‌క్ష‌ణ కేంద్రంలో అరుదైన జెర్రి
Advertisement

Tiger centipede | త్రినేత్ర న్యూస్ : పులి( Tiger )ని చూస్తే ఎవ‌రికైనా వెన్నులో వణుకుపుడుతోంది. మ‌రి ఆ మాదిరి పోలిన జెర్రిని చూస్తే కూడా ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తోంది. సాధార‌ణంగా న‌లుపు లేదా ముదురు రంగులో ఉండే జెర్రిల‌తో పోల్చితే.. ఈ జెర్రి కాస్త డిఫరెంట్‌గా ఉంది. మంచిర్యాల జిల్లాలోని క‌వ్వాల్ పులుల సంరక్ష‌ణ కేంద్రం( Kawal Tiger Reserve ) లో పులి చార‌లను పోలిన జెర్రి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ జెర్రి బేస్ క్యాంపు వాచర్ చిన్న భీమ‌య్య కెమెరాకు చిక్కింది.

నారింజ, నలుపు రంగుల పట్టీలతో పులి రూపాన్ని తలపించే ఈ జీవిని ‘టైగర్‌ సెంటీపీడ్‌’( Tiger centipede ) గా పిలుస్తారు. ఇది నెమ్మ‌దిగా కదులుతుంది. చురుకైన వేట‌గాడు కూడా. ముందు కాళ్లు కోరల్లా మారి విషాన్ని ఎక్కిస్తాయి. ఈ ర‌కం జెర్రీల ప్ర‌ధాన ఆహారం.. కీటకాలు, వానపాములు, చిట్టెలుకలు. మనుషులకు ప్రాణహాని కలిగించకపోయినా, కాటు వేస్తే తీవ్రమైన నొప్పి, వాపు కలుగుతాయి. ఏడు అంగుళాల వరకు పెరిగే ఈ జెర్రి 4-7 సంవత్సరాల వరకు జీవిస్తుంది.

ట్యాగ్స్:

ForestKawal Tiger ReserveMancherialTelanganaTigerTiger Centipede
Advertisement
Advertisement