త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger | క‌ట్టెల కోసం వెళ్తే.. పెద్ద పులి దాడి

Tiger | తెలంగాణ వ్యాప్తంగా పులుల సంచారం ఎక్కువైపోయింది. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ పెద్ద పులి పంజా విసిరింది.

S

Telangana | Published On Apr 24, 2026, 2.59 pm IST

Tiger | క‌ట్టెల కోసం వెళ్తే.. పెద్ద పులి దాడి
Advertisement

Tiger | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా పులుల సంచారం ఎక్కువైపోయింది. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ పెద్ద పులి పంజా విసిరింది. స్కూల్ తండా శివారులోని అట‌వీ ప్రాంతంలో ఓ వ్య‌క్తి ర‌క్తాన్ని చూసింది.

అడ‌విలోకి క‌ట్టెల కోసం వెళ్లిన స‌ద‌రు వ్య‌క్తిపై పులి దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచింది. అత‌ని త‌ల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో.. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాధిత వ్య‌క్తి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

పులి దాడి నేప‌థ్యంలో స్కూల్ తండా వాసుల‌తో పాటు స‌మీప గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇదే స్కూల్ తండాలో గ‌త ఆరు నెల‌ల క్రితం పెద్ద‌పులి ప‌శువుల‌పై దాడి చేసి చంపింది. తాజాగా వ్య‌క్తిపై దాడి చేయ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స్థానికుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులిని ప‌ట్టుకోవాల‌ని అట‌వీశాఖ అధికారుల‌ను డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement