త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger | కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి క‌ల‌క‌లం.. రాత్రి బ‌ర్రెపై దాడి

Tiger | తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పెద్ద పులుల సంచారం క‌ల‌కలం రేపుతోంది. మంచిర్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం పెద్ద పులులు సంచ‌రించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అడ‌వుల్లోనూ ప‌ర్యాట‌కుల‌కు పెద్ద పులులు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

S

Telangana | Published On Dec 18, 2025, 1.31 pm IST

Tiger | కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి క‌ల‌క‌లం.. రాత్రి బ‌ర్రెపై దాడి
Advertisement

Tiger | తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పెద్ద పులుల సంచారం క‌ల‌కలం రేపుతోంది. మంచిర్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం పెద్ద పులులు సంచ‌రించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అడ‌వుల్లోనూ ప‌ర్యాట‌కుల‌కు పెద్ద పులులు ద‌ర్శ‌న‌మిచ్చాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ పెద్ద పులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది.

కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ‌, బిక్క‌నూర్, దోమకొండ మండ‌లాల్లో పెద్ద‌పులి సంచ‌రిస్తూ స్థానికుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుంది. వ‌రుస‌గా నాలుగు రోజుల నుంచి మూగ‌జీవాలపై దాడులు చేస్తూ.. రైతుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

నిన్న రాత్రి పాల్వంచ మండ‌లం ఇసాయిపేట గ్రామ శివారులోని అన్నారం వ‌డ్డెర కాల‌నీ సందు క‌ట్టులో పెద్ద పులి సంచ‌రించింది. అక్క‌డున్న ఓ బ‌ర్రెపై దాడి చేసి చంపేసింది. బ‌ర్రె య‌జ‌మాని అటవీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అట‌వీశాఖ అధికారులు పులి పాద‌ముద్ర‌ల‌ను సేక‌రించారు. స్థానికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. ఒంట‌రిగా బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌ని కోరారు. రైతులు, కూలీలు త‌మ వ్య‌వ‌సాయ పొలాల‌కు గుంపులుగా వెళ్లాల‌ని సూచించారు.

పెద్దపులి దాడి చేసిన ప్రాంతాలను కామారెడ్డి ఎఫ్‌డీవో రామకృష్ణ‌ పరిశీలించారు. పెద్దపులి కదలికలపై మూడు బృందాలుగా అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ లోనే మకాం వేశారు. ఎవరికైనా పెద్ద పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎఫ్‌డీవో కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement