త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kyama Mallesh | తుమ్మ‌ల‌కు ఎంతో తెలుసు.. కానీ రేవంత్ సోప‌తివ‌ట్టి మొద్దుబారిండు: బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్

Kyama Mallesh | రాష్ట్రంలో కనీసం యాసంగి వడ్లు కొనలేని దయనీయ పరిస్థితి ఉందని, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుకు ఎంతో అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డ‌తో దోస్తీ చేసి మొద్దుబారిపోయిండ‌ని బీఆర్ఎస్ నేత క్యామ మ‌ల్లేష్ ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On May 23, 2026, 2.55 pm IST

Kyama Mallesh | తుమ్మ‌ల‌కు ఎంతో తెలుసు.. కానీ రేవంత్ సోప‌తివ‌ట్టి మొద్దుబారిండు: బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్
Advertisement
  • యాసంగి వ‌డ్లు కొనే దిక్కు లేదు
  • రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి
  • డీజీపీకి మంచి పేరు ఉంది.. శాంతి భద్రతలు కాపాడాలి
  • ఆకునూరి మురళి ఊరుకునే రకం కాదు.. రేపోమాపో నోరు విప్పుత‌డు
  • రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థలు దిగ‌జారిపోయాయి
  • మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ నేత క్యామ మ‌ల్లేష్‌

Kyama Mallesh | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో కనీసం యాసంగి వడ్లు కొనలేని దయనీయ పరిస్థితి ఉందని, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుకు ఎంతో అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డ‌తో దోస్తీ చేసి మొద్దుబారిపోయిండ‌ని బీఆర్ఎస్ నేత క్యామ మ‌ల్లేష్ ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు పట్టించుకొకపోతే సీఎంకు వాళ్ల‌ ఉసురు తగులుతుందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ‌లా తీర్చిదిద్దితే రేవంత్‌రెడ్డి క‌నీసం రైతుబంధు ఇవ్వ‌ని అసమ‌ర్థుడుగా ఉన్నార‌ని విమ‌ర్శించారు. శ‌నివారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై ఫైర‌య్యారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని అన్నపూర్ణలా తీర్చిదిద్దారు. రైతుబంధు సీఎం రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారు. మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం వెంటనే రివ్యూ నిర్వహించాలి. వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అనుభవం ఉంది. కానీ రేవంత్ రెడ్డితో దోస్తీ చేసి తుమ్మల మొద్దుబారి పోయారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దిగజారాయి అని మ‌ల్లేష్ విమ‌ర్శించారు.

రేవంత్ మాట‌లు న‌మ్మి కేసీఆర్ ను విమ‌ర్శించారు..

ఆకునూరి మురళి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రాజకీయ నాయకుడి కంటే ఎక్కువగా కేసీఆర్ పై విమర్శలు చేశారు.
ఇప్పుడు తోక ముడుచుకుని ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ఆకునూరి ఊరుకునే రకం కాదు. రేపో, ఎల్లుండో నోరు విప్పుతారు. రేవంత్ రెడ్డి పాలనను తుదముట్టించేందుకు అందరూ రెడీ అవుతున్నారు అని క్యామ మ‌ల్లేష్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు హత్యకు గురయ్యారు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేయాలి. డీజీపీకి మంచి పేరు ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అని క్యామ మ‌ల్లేశ్ కోరారు.

 

Advertisement
Advertisement