Road Accident | నస్పూర్లో లారీ, ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం!
Road Accident | మంచిర్యాల జిల్లా నస్పూర్ (Naspur) గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పనికోసం వెళ్తున్న కూలీల ఆటో.. లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
Road Accident | త్రినేత్ర న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ (Naspur) గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పనికోసం వెళ్తున్న కూలీల ఆటో.. లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

మందమర్రి మండలం పొన్నారం, గుడిపల్లి గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు మంచిర్యాలలోని (Mancherial) షాపింగ్ మాల్లో (Shopping Mall) పనిచేస్తున్నారు. రోజూలానే విధులకు హాజరయ్యేందుకు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో నస్పూర్ గేటు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా మంచిర్యాల వైపు నుంచి జైపూర్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను మందమర్రి మండలం గుడిపల్లి, పొన్నారం గ్రామాలకు చెందిన సౌందర్య, రవళి, లక్ష్మిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
మంచిర్యాల జిల్లా నస్పూర్లో చోటు చేసుకున్న ఘటన
నస్పూర్ గేట్ ఏరియా జాతీయ రహదారిపై లారీ–ఆటో ఢీ
రాంగ్ రూట్లో వెళ్లడంతో.. ఎదురుగా ఆటోని ఢీకొన్న లారీ
ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి
మృతులను మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి… pic.twitter.com/nkHenaeFdO
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 28, 2026
సంబంధిత వార్తలు

Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
సెప్టెంబర్ 26, 2026

Six dies in Road Accident | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సంగీత కళాకారుల దుర్మరణం
సెప్టెంబర్ 25, 2026

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●BRS Leaders | సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న
- ●Nidhi Tiwari Suicide | ఇన్స్టాలో లక్షల మంది ఫాలోవర్స్.. ఇన్ఫ్లుయెన్సర్ నిధి తివారీ సూసైడ్: ఆ ఫోన్ సంభాషణ తర్వాతే తీవ్ర నిర్ణయం
- ●Ex Dividend Stocks | డివిడెండ్ అలర్ట్.. ఏయే షేర్లకు ఇస్తున్నారంటే..
- ●Teenmar Mallanna | ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్ధీ చదువును మధ్యలోనే ఆపేయకూడదు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ●Microsoft Copilot | మైక్రోసాఫ్ట్ కోపైలట్లో భారీ మార్పులు.. ఇక ఏఐతోనే అన్ని పనులు..

Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్

BRS Leaders | సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న

Nidhi Tiwari Suicide | ఇన్స్టాలో లక్షల మంది ఫాలోవర్స్.. ఇన్ఫ్లుయెన్సర్ నిధి తివారీ సూసైడ్: ఆ ఫోన్ సంభాషణ తర్వాతే తీవ్ర నిర్ణయం

Ex Dividend Stocks | డివిడెండ్ అలర్ట్.. ఏయే షేర్లకు ఇస్తున్నారంటే..



