త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garima Agarwal | స‌త్యారెడ్డి లెక్క సాగు చేయండి.. ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకోండి

(Garima Agarwal | రైతులంతా గుర్రాల సత్యారెడ్డి (Satya Reddy) లెక్క సాగు (Farming) చేస్తూ మంచి ఆదాయం పొందాల‌ని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ‌ర్వాల్ (Garima Agarwal) సూచించారు.

S

Telangana | Published On Nov 10, 2026, 6.26 pm IST

Garima Agarwal | స‌త్యారెడ్డి లెక్క సాగు చేయండి.. ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకోండి
Advertisement
  • ఎక‌రంల ర‌క‌ర‌కాల ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు పండించ‌డం అభినంద‌నీయం
  • వ్య‌వ‌సాయ‌ క్షేత్ర పరిశీలన‌లో సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ‌ర్వాల్

Garima Agarwal | త్రినేత్ర న్యూస్: రైతులంతా గుర్రాల సత్యారెడ్డి (Satya reddy) లెక్క సాగు (Farming) చేస్తూ మంచి ఆదాయం పొందాల‌ని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ‌ర్వాల్ (Garima Agarwal) సూచించారు. ఎక‌రం 20 గుంట‌ల భూమిలో ర‌క‌ర‌కాల ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు పండించ‌డం స్ఫూర్తిదాయ‌క‌మ‌న్నారు. కోతులు, ఇత‌ర జంతువుల నుంచి ర‌క్ష‌ణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో సత్యారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె మంగ‌ళ‌వారం క్షేత్ర‌స్థాయికి వెళ్లి ప‌రిశీలించారు.

 

సాగు విధానాన్ని పరిశీలించి యాజమాన్య పద్ధతులు, ఉత్పత్తి, విక్రయం, పొందే ఆదాయ వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్న రైతును అభినందించారు. మిగతా రైతులంతా ఆయన్ను ఆదర్శంగా తీసుకొని సాగు చేయాలని పిలుపునిచ్చారు.

స‌త్యారెడ్డి ఏమేం పండిస్తున్నాడంటే..

ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పూదీన, ఉలిగడ్డలు, వంకాయలు, సొరకాయ, పచ్చిమిర్చి, బీట్ రూట్, కంది వంటి వాటిని సాగు చేస్తున్నారు. ఆకు కూరలు, కూరగాయల ఉత్పత్తులు వారవారం చేతికి అందుతున్నాయి. వీటి నుంచి ప్రతి నెలా రూ.50 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు సత్యారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ దివ్య, ఎంపీడీవో సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement