Ration | మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. ఆగస్టు 1 నుంచి పంపిణీ..
Ration | రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. మరోసారి మూడు నెలల రేషన్ (Ration) బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఎండల నేపథ్యంలో ఏప్రిల్-జూన్ (3 నెలలు) నెలల కోటా బియ్యాన్ని (Ration Rice) ఏప్రిల్ నెలలోనే ఇచ్చిన విషయం తెలిసిందే.
Ration | త్రినేత్ర.న్యూస్: రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. మరోసారి మూడు నెలల రేషన్ (Ration) బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఎండల నేపథ్యంలో ఏప్రిల్-జూన్ (3 నెలలు) నెలల కోటా బియ్యాన్ని (Ration Rice) ఏప్రిల్ నెలలోనే ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో (El Nino effect) వర్షాభావ పరిస్థితులు నెలకడంతో మరోసారి 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ రేషన్ బియ్యం కోటాను వచ్చే నెలలో ఒకేసారి ఇవ్వనున్నారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే సమాచారం అందించడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణంగా డీలర్లు ప్రతి నెల మొదటి 15 రోజులు రేషన్ బియ్యం ఇచ్చేవారు. వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనుండటంతో ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరచి బియ్యం అందించాల్సి ఉంటుంది. దీనిప్రకారం ప్రతి రేషన్ కార్డుదారు (Ration Card) మూడుసార్లు వేలి ముద్రలు వేయాలి. దీనికి అనుగుణంగా రేషన్ దుకాణాలకు రెండు, మూడుసార్లలో సరిపడా బియ్యాన్ని రవాణా చేయనున్నారు. చిన్న దుకాణాలకైతే ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండు, మూడుసార్లు నిల్వకు అనుగుణంగా రవాణా చేస్తారు.
31 వరకు ఈ-కేవైసీ గడువు
మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈ-కేవైసీని (e-KYC) పౌరసరఫరాల శాఖ తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తిచేసిన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా చేయనున్నారు. దీనికోసం ఈ నెల 31 వరకు గడువు ఇచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
- ●Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం






