Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
Faria Abdullah | ‘జాతిరత్నాలు’ సినిమాతో ‘చిట్టి’గా ఒక్కసారిగా పాపులర్ అయింది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ పొడుగాటి భామ.. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని భిన్నంగా మలుచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
Entertainment | Published On Sep 30, 2026, 6.18 pm IST
Faria Abdullah | ‘జాతిరత్నాలు’ సినిమాతో ‘చిట్టి’గా ఒక్కసారిగా పాపులర్ అయింది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ పొడుగాటి భామ.. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని భిన్నంగా మలుచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్, కామియోస్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘జాతిరత్నాలు’ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘బంగార్రాజు’, ‘రావణాసుర’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘మత్తు వదలరా 2’ వంటి చిత్రాల్లో కనిపించింది ఫరియా. అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. పాత్ర నిడివి కంటే తనకు నచ్చిన పాత్రకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తోంది. నటనతో పాటు ఇతర విభాగాల్లోనూ తన ప్రతిభను చూపిస్తోంది. ‘మత్తు వదలరా 2’లో పాటకు లిరిక్స్ రాయడంతో పాటు ర్యాప్, కొరియోగ్రఫీ కూడా చేసింది.
డైరెక్షన్‌పై మనసుపడ్డ చిట్టీ..
ఇక ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. దర్శకురాలిగా మారాలన్నది తన ఆశయమని ఫరియా వెల్లడించింది. ఇప్పటికే తన డైరెక్టోరియల్ డెబ్యూ కోసం స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలిపింది. అయితే వెంటనే సినిమాను పట్టాలెక్కించే ఆలోచన మాత్రం లేదట. కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు తగినంత సమయం తీసుకుని.. స్క్రిప్ట్ విషయంలో పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే నిర్మాతలను సంప్రదించాలని భావిస్తోంది. థియేటర్‌లోనూ పనిచేసిన అనుభవం ఉన్న ఫరియాకు దర్శకత్వంపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. అందులో భాగంగానే కథలు రాసే పనిలోనూ బిజీగా ఉంది. నటిగా తనకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే.. మరోవైపు దర్శకురాలిగా తన తొలి అడుగులకు సిద్ధమవుతోంది. మరి ‘చిట్టి’గా ప్రేక్షకులను మెప్పించిన ఫరియా.. దర్శకురాలిగా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి.
అవకాశాల కోసం ఎదురుచూపులు
హీరోయిన్‌గా తొలి సినిమాతోనే పెద్ద విజయాన్ని అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత అదే స్థాయిలో వరుస అవకాశాలు రావడం ఫరియా కెరీర్‌లో కాస్త నెమ్మదించింది. అయినా, సినిమాలకు దూరంగా ఉండకుండా తనకు వచ్చిన భిన్నమైన అవకాశాలను ఎంచుకుంటోంది. తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం నటనతో పాటు రచన, దర్శకత్వంపై దృష్టి పెట్టడం ద్వారా సినిమా రంగంలో తన ప్రయాణాన్ని మరో దిశగా తీసుకెళ్లాలని చూస్తోంది. ఇక దర్శకురాలిగా ఆమె తొలి ప్రయత్నం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
- ●KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం
- ●CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు
- ●Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!
- ●OnePlus | వన్‌ప్లస్ దీపావళి సేల్.. స్మృతి మంధానాతో ప్రచారం..

Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్

KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం

CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు





