త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్

Kayadu Lohar | వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది హీరోయిన్ కయదు లోహర్. వరుస అవకాశాలు వస్తున్నా.. ఇందులో ఏదీ ఆమె కెరీర్‌కు కావాల్సిన స్థాయిలో బ్రేక్ ఇవ్వడం లేదు. ఒక్క మంచి హిట్ పడితే టాలీవుడ్‌లో తన స్థానం మరింత బలోపేతమవుతుందని ఆశలు పెట్టుకున్న ఈ భామకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది.

P

Entertainment | Published On Sep 30, 2026, 7.05 pm IST

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్
Advertisement

Kayadu Lohar | వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది హీరోయిన్ కయదు లోహర్. వరుస అవకాశాలు వస్తున్నా.. ఇందులో ఏదీ ఆమె కెరీర్‌కు కావాల్సిన స్థాయిలో బ్రేక్ ఇవ్వడం లేదు. ఒక్క మంచి హిట్ పడితే టాలీవుడ్‌లో తన స్థానం మరింత బలోపేతమవుతుందని ఆశలు పెట్టుకున్న ఈ భామకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. తాజాగా ‘ది ప్యారడైజ్’ సినిమాపై పెట్టుకున్న ఆశలు కూడా అనుకున్న స్థాయిలో ఫలించలేదనే చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని కయదు గట్టిగానే నమ్మిందట. ముఖ్యంగా సినిమాలో తన పాత్రకు మంచి స్కోప్ ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్లు నో చెప్పినప్పటికీ.. నాని వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం కావడంతో కయదు ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, సినిమా విడుదల తర్వాత ఆమె పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కథకు లింక్‌లేని పాత్ర..

‘ది ప్యారడైజ్’లో కయదు కొంత బోల్డ్‌గా కనిపించింది. హీరోయిన్ తరహా పాత్రలో కనిపించడంతో పాటు సిగరెట్ తాగే సన్నివేశాల్లోనూ ఆమెను చూపించారు. దీంతో విడుదలకు ముందు నుంచే ఈ పాత్రపై ఆసక్తి ఏర్పడింది. సినిమాలో ఆమె పాత్రకు ప్రధాన కథతో బలమైన అనుసంధానం లేకపోవడం మైనస్‌గా మారిందనే టాక్ వచ్చింది. కథను ముందుకు తీసుకెళ్లే కీలక పాత్రగా కాకుండా.. కొన్ని సన్నివేశాలకు, గ్లామర్ టచ్‌కు మాత్రమే పరిమితమైందనే కామెంట్స్‌ వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది కయదుకు సినిమాల పరంగా మాత్రం కొదవ లేదు. వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘ఫంకీ’తో మొదలైన ఈ ప్రయాణంలో ‘పల్లీ చట్టాంబి’, ‘ఐయామ్ గేమ్’, ‘హృదయం మురళి’ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు కాగా.. వరుస విడుదలలతో కయదు తరచూ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. అయితే ఇన్ని సినిమాలు వచ్చినా.. ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపుతిప్పే విజయం మాత్రం దక్కలేదు. ఒక సినిమా మీద ఆశలు పెట్టుకోవడం.. అది అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో మరో ప్రాజెక్ట్‌పై నమ్మకం పెట్టుకోవడం.. ప్రస్తుతం కయదు కెరీర్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’ తనకు టాలీవుడ్‌లో గట్టి గుర్తింపు తెస్తుందని భావించిన సమయంలో.. ఆ ఆశ కూడా నెరవేరకపోవడం ఆమె అభిమానులకు నిరాశ కలిగించే విషయమే.

అయినా తగ్గేదెలే..

ఇక తెలుగులో సరైన బ్రేక్ రాకపోయినా.. కయదు కెరీర్ ఆగిపోయే పరిస్థితి మాత్రం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ సినిమాలు ఉన్నాయి. శివకార్తికేయన్, సూర్య వంటి క్రేజీ హీరోలతో కలిసి నటించే అవకాశాలు దక్కించుకుంటోంది. దీంతో కోలీవుడ్‌పై ఈ భామ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ దక్కుతున్న అవకాశాలు తన కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయనేది రాబోయే సినిమాల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. టాలీవుడ్‌లో కయదుకు ఇప్పటికే కొంత క్రేజ్ ఉంది. వరుస అవకాశాలు రావడానికి ఆ క్రేజ్ ఉపయోగపడుతున్నా.. దాన్ని స్థిరమైన స్టార్‌డమ్‌గా మార్చే కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇంకా దక్కలేదు. మంచి కథ, బలమైన పాత్ర, అందుకు తగ్గ విజయవంతమైన సినిమా.. ఈ మూడు కలిస్తే కయదు కెరీర్‌కు కావాల్సిన మలుపు రావచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న తమిళ సినిమాలపైనే అందరి దృష్టి ఉంది. అవి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో.. కయదు కెరీర్‌కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవుతాయో చూడాలి.

Advertisement
Advertisement