LPG Cylinder Rules | రేపటి నుంచి మారనున్న గ్యాస్ సిలిండర్ నిబంధనలు.. ఇకపై వారికి కమర్షియల్ ధరకే!
LPG Cylinder Rules | గృహావసరాల కోసం ఎల్పీజీ సిలిండర్లు (LPG Cylinder) ఉపయోగించే వినియోగదారులకు అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల (LPG Cylinder Rules) ప్రకారం డొమెస్టిక్ సిలిండర్‌పై లభించే సబ్సిడీని (Subsidy) కొనసాగించాలంటే బయోమెట్రిక్ ఇ-కేవైసీ (E-KYC) తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే.
LPG Cylinder Rules | త్రినేత్ర న్యూస్: గృహావసరాల కోసం ఎల్పీజీ సిలిండర్లు (LPG Cylinder) ఉపయోగించే వినియోగదారులకు అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల (LPG Cylinder Rules) ప్రకారం డొమెస్టిక్ సిలిండర్‌పై లభించే సబ్సిడీని (Subsidy) కొనసాగించాలంటే బయోమెట్రిక్ ఇ-కేవైసీ (E-KYC) తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. ఈ-కేవైసీ గడువు బుధవారంతో ముగిసిపోనుంది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తిచేయని వారికి సబ్సిడీ నిలిచిపోనుంది. సిలిండర్‌ను యధావిధిగా బుక్ చేసుకోవచ్చు.. కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లానే పూర్తి ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన దేశవ్యాప్తంగా గురువారం నుంచి అమల్లోకి రానుంది.
మరోవైపు గ్యాస్ సిలిండర్ హోమ్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) వ్యవస్థను పంపిణీ సంస్థలు కచ్చితంగా అమలులో చేయనున్నాయి. డెలివరీ బాయ్‌కి ఓటీపీ చెబితేనే సిలిండర్ అందజేయబడుతుంది. తద్వారా సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది.

ఇకపై కమర్షియల్ రేట్లే
ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు, సాధారణ వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్‌కు ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను (Aadhaar e-KYC) బుధవారం సాయంత్రం (సెప్టెంబర్ 30)లోగా పూర్తి చేయాలి. అలా చేయనివారికి డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను కమర్షియల్ రేట్ల ప్రకారం అమ్మకానికి ఉంచుతారు. అయితే ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసినవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ముందుగా 2026 జూన్ 30 నాటికి ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే దానిని జూలై 31, ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్ 17 వరకు పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. చివరికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 19 నాటికి దేశంలోని 274.3 మిలియన్ల (89.9 శాతం) మంది వినియోగదారులు బయోమెట్రిక్ పూర్తి చేశారు. బుధవారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కేవేసీ పూర్తిచేయని వారు కమర్షియల్ సిలిండర్‌లానే మొత్తం ధరను చెల్లించాల్సి ఉంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ ధర రూ. 994గా ఉంది. కమర్షియల్ ఎల్పీజీ ధర (19 కేజీలు) రూ. 2,800పైగా ఉంది. దీంతో ప్రతీనెల ఆయా ధరలకు అనుగుణంగా సిలిండర్ కోసం బడ్జెట్‌ను కేటాయించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అదనపు చెల్లింపుల నుంచి తప్పించుకోవాలంటే వెంటనే ఇ-కేవైసీ పూర్తి చేయండి!
అక్టోబర్ 1 నుంచి బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి కాని వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనాలను (Subsidy Cut) నిలిపివేయాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలను ఆదేశించింది. సబ్సిడీ నిజమైన అర్హులకు మాత్రమే అందాలని, గృహ వినియోగ సిలిండర్లు కమర్షియల్ అవసరాలకు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
సిలిండర్ బుకింగ్ రూల్స్
గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల కోసం రీఫిల్ బుకింగ్ మధ్య ఉన్న కనీస సమయాన్ని 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించింది. పట్టణ ప్రాంత వినియోగదారులకు మాత్రం బుకింగ్ వ్యవధిని 25 రోజులుగానే కొనసాగిస్తున్నది.
తాజావార్తలు
- ●Anthropic | క్లాడ్ సోనెట్ 5.5 ఏఐ లాంచ్.. తక్కువ ఖర్చుతో పనిచేసుకోవచ్చు..
- ●Kancha Ilaiah | వరంగల్ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్ మనువడి పేరు..!
- ●YouTube | ఏఐ కంటెంట్ పోస్ట్ చేసినా మానిటైజేషన్.. యూట్యూబ్ ఇండియా ఎండీ కీలక వ్యాఖ్యలు..
- ●Bhatti Vikramarka | ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాలి : డిప్యూటీ సీఎం భట్టి
- ●MRPL oil refinery | మంగళూరు రిఫైనరీలో భారీ పేలుడు
- ●HBL Engineering | భారీగా రాబడి ఇచ్చిన షేర్.. రూ.1 లక్ష పెడితే రూ.53 లక్షలు వచ్చాయి..

Anthropic | క్లాడ్ సోనెట్ 5.5 ఏఐ లాంచ్.. తక్కువ ఖర్చుతో పనిచేసుకోవచ్చు..

Kancha Ilaiah | వరంగల్ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్ మనువడి పేరు..!

YouTube | ఏఐ కంటెంట్ పోస్ట్ చేసినా మానిటైజేషన్.. యూట్యూబ్ ఇండియా ఎండీ కీలక వ్యాఖ్యలు..

Bhatti Vikramarka | ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాలి : డిప్యూటీ సీఎం భట్టి






