KGBV | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
KGBV | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జే విజయసాగర్ తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
- అకౌంటెంట్, ఏఎన్‌ఎం పోస్టులు.. డిసెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ
KGBV | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జే విజయసాగర్ తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఒక అకౌంటెంట్ (ఓసీ), ఒక ఏఎన్‌ఎం (ఓసీ) పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయసున్న స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా స్థానికతను నిర్ధారించనున్నారు.
అకౌంటెంట్ పోస్టుకు కామర్స్ డిగ్రీతో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్‌లో సర్టిఫికెట్ కోర్సు (ట్యాలీ, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ తదితరాలు) పూర్తి చేసి ఉండాలి. లేదా బీకామ్ కంప్యూటర్స్ అర్హత కలిగి ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఏఎన్‌ఎం పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు ఏఎన్‌ఎం శిక్షణ సర్టిఫికెట్ తప్పనిసరి. జీఎన్‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ఆధారంగా నిర్వహించనున్నారు. ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల చేయగా, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
డిసెంబర్ 7న తాత్కాలిక మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. డిసెంబర్ 8న అభ్యంతరాలు స్వీకరించి, డిసెంబర్ 9న తుది మెరిట్ జాబితా, షార్ట్‌లిస్ట్ వెల్లడిస్తారు. డిసెంబర్ 11న సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, ఎస్-34, జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, రాజన్న సిరిసిల్లలో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలను జిల్లా అధికారిక వెబ్‌సైట్ rajannasiricilla.telangana.gov.in తెలుసుకోవచ్చని జిల్లా విద్యాధికారి సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..
- ●Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?
- ●MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ
- ●Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్
- ●Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి

India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..

Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ

Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!





