త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arjun | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి క‌థ‌తో సినిమా – అయోధ్య‌లో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడితో పాటు ఆప‌రేష‌న్ సింధూర్ ఘ‌ట‌న‌ల ఆధారంగా సీనియ‌ర్ హీరో అర్జున్ ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ శ‌నివారం అయోధ్యంలో లాంఛ్ అయ్యింది. తొమ్మిది భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Nov 28, 2026, 4.15 pm IST

Arjun | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి క‌థ‌తో సినిమా – అయోధ్య‌లో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్
Advertisement

Arjun |  ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడితో పాటు ఆప‌రేష‌న్ సింధూర్ ఘ‌ట‌న‌ల ఆధారంగా సీనియ‌ర్ హీరో అర్జున్ ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ దేశ‌భ‌క్తి సినిమాలో హీరోగా న‌టిస్తూనే స్వ‌యంగా అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. శ‌నివారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అయోధ్య ఆల‌యంలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ ఆల‌యంలో ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకున్న మొద‌టి సినిమాగా నిలిచింది.

175వ సినిమా...

అర్జున్ కెరీర్‌లో 175వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఆర్మీ రిటైర్డ్ మేజ‌ర్ విజ‌య్ భార్గ‌వ్ క‌థ, స్క్రీన్‌ప్లే అందించ‌బోతున్నారు. దేశ భ‌ద్ర‌త విష‌యంలో సైనికుల త్యాగాన్ని, వారి ధైర్య‌సాహ‌సాల్ని చాటిచెబుతూ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడితో పాటు ఆప‌రేష‌న్ సింధూర్ వెనుక ఎవ‌రికి తెలియ‌ని కోణాల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. యాక్ష‌న్‌తో పాటు ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా సాగుతుంద‌ని వెల్ల‌డించారు.

తొమ్మిది భాష‌ల్లో రిలీజ్‌...

హిందీలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా మొత్తం తొమ్మిది భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది. డిసెంబ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి 2027 ఆగ‌స్ట్ 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత అనూప్ మోహ‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయ‌నున్నారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ ఓపెనింగ్ వేడుక‌లో అర్జున్ స‌ర్జా భార్య నివేదిత పాల్గొన్న‌ది.

 

View this post on Instagram

 

A post shared by Anoop K (@presidentialmovies)

Advertisement
Advertisement