Gas Cylinder Explosion | ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురు సజీవ దహనం
Gas Cylinder Explosion | నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో (Miryalaguda) ఘోర ప్రమాదం జరిగింది. పట్టణంలోని గాంధీ నగర్‌లోని ఓ ఇంట్లో షార్ట్ సర్య్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Gas Cylinder Explosion | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో (Miryalaguda) ఘోర ప్రమాదం జరిగింది. పట్టణంలోని గాంధీ నగర్‌లోని ఓ ఇంట్లో షార్ట్ సర్య్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి గ్యాస్ సిలిండర్ (Gas Cylinder Explosion) పేలింది. దీంతో ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతులను అమ్మమ్మ చంద్రమ్మ (50), మనవడు లక్ష్మణ్ (17), మనవరాలు ప్రణతి (14)గా గుర్తించారు.
గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిల్లల తల్లిదండ్రులు వేర్వేరు నగరాల్లో కూలీ పనులు చేస్తున్నారు. దీంతో వారు అమ్మమ్మ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నారు.
తాజావార్తలు
- ●10th Supplementary Exams | నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..
- ●Revised Land Rates | అమల్లోకి పెరిగిన భూముల విలువలు.. ఎకరాకు కనిష్ఠం రూ.2.75 లక్షలు.. గరిష్ఠం రూ.35 కోట్లు
- ●Heavy Rainfall | నేటి నుంచి ఈ నెల 8 వరకు భారీ వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- ●Free MMTS Travel | ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ఆ షరతులకు అంగీకరిస్తేనే!
- ●Horoscope | జూన్ 5 రాశి ఫలాలు.. ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!
- ●Liver Protection Supplements | రెగ్యులర్గా మందు తాగుతున్నారా? లివర్ పాడవకుండా ఈ 3 సప్లిమెంట్స్ వాడండి!

10th Supplementary Exams | నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..

Revised Land Rates | అమల్లోకి పెరిగిన భూముల విలువలు.. ఎకరాకు కనిష్ఠం రూ.2.75 లక్షలు.. గరిష్ఠం రూ.35 కోట్లు

Heavy Rainfall | నేటి నుంచి ఈ నెల 8 వరకు భారీ వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Free MMTS Travel | ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ఆ షరతులకు అంగీకరిస్తేనే!






