Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే
Vedma Bojju| సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడిన మాటలు పిల్ల కాకి కొండా సుష్మితవి కావని.. అవి మంత్రి కొండా సురేఖవేనని అనుకుంటున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆరోపించారు. అధిష్టానం స్పందించి కొండా సురేఖ, రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
- రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలను వదిలేసి కొండా సురేఖ మీద పడ్తలేం
- చేతి గుర్తును నరకాలనుకుంటున్నవారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి
- లేదంటే భవిష్యత్‌లో పార్టీ నష్టపోతది
- అటవీ సమస్యలు పరిష్కరించమంటే అనవసర తతంగం చేస్తున్నరు
- ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫైర్
Vedma Bojju| త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడిన మాటలు పిల్ల కాకి కొండా సుష్మితవి కావని.. అవి మంత్రి కొండా సురేఖవేనని అనుకుంటున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆరోపించారు. తన బిడ్డ మాటలపై సురేఖ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఎందుకు ఆ వ్యాఖ్యలను ఖండించలేకపోతున్నారని ప్రశ్నించారు. అధిష్టానం స్పందించి కొండా సురేఖ, రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మేమంతా చేతి గుర్తు మీద గెలిచామని, చేతి గుర్తును నరకాలనుకుంటున్న వారు పార్టీలో ఉండడానికి వీల్లేదన్నారు. మాలాంటి జూనియర్లకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి రోడ్ల మీదికొచ్చి మాట్లాడడం సరికాదన్నారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద పార్టీ ఎమ్మెల్యేలమంతా మాట్లాడదాం అని ఇక్కడికి వచ్చాం. రాజగోపాల్‌రెడ్డిని, చిన్నారెడ్డినో వదిలేసి మేం కొండా సురేఖ మీద పడ్తలేం. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి కొందరు కుట్ర చేస్తున్నరు. దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడినవి కాదని నేను అనుకుంటున్నా. అవి కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలేనని నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.
ఇది మొదటి సారి కాదు. కొండా సరేఖ ఓఎస్డీ మీద ఏదో హత్యాయత్నం కేసు నమోదైందని ఏదో పేపర్లో వచ్చింది. ఆరోజుల్లో పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఆరోజుల్లో కూడా సీఎం మీద అనేక ఆరోపణలు చేసిర్రు. దానికంటే ముందు సినిమా వాళ్ల మీద కూడా ఆరోపణలు జరిగినాయి. ఇది మూడోసారి.. డైరెక్ట్‌గా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసుకొని మాట్లాడారు. కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా మా రేవూరి ప్రకాశ్‌రెడ్డి గారిని ఇష్టారీతిన మాట్లాడింది. దమ్ముంటే రావాలి.. ఎవరు ప్రచారం చేస్తరో చేయాలి అనే సవాల్ విసిరే సంస్కృతి. దీనిపై కొండా సురేఖ దాటేసే ప్రయత్నం చేస్తున్నరు. మరి మీ అమ్మాయి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేకపోతున్నరు?
నా ప్రాంతంలో సమస్యలున్నయ్.. సురేఖగారు ఎన్ని రివ్యూ మీటింగ్‌లు పెట్టారో చెప్పాలి?
కొండా సురేఖ అటవీ, దేవాదాయ శాఖా మంత్రిగా ఉండి ఈరోజు వరకు ఎన్ని రివ్యూ మీటింగ్‌లు పెట్టారు? నా ప్రాంతంలో అటవీ సమస్యలు ఉన్నాయి. ఎంత అలజడి జరుగుతుంది. ఎన్నోసార్లు మిమ్మల్ని ఆహ్వానించినం. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి ముఖ్యమంత్రి చేసే పనులపై అనుకూలంగా ఉండాలి. కానీ మీ బిడ్డ మాటలను కనీసం ఖండించకుండా, కౌంటర్ ఇవ్వకుండా.. అది నా తప్పు కాదు అని మాట్లాడుతున్నరు.
మాలాంటి జూనియర్లం మీ నుంచి నేర్చుకోవాలి.. కానీ
రాజగోపాల్‌రెడ్డి వ్యవహరించే తీరు మంచిది కాదు. చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. వారు మాట్లాడే మాటలు కూడా కరెక్టు కాదు. ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులే ఇలా రోడ్డు మీద మాట్లాడినప్పుడు మాలాంటి జూనియర్లు, మొదటిసారి నేను ఎమ్మెల్యేను అయినా. వాస్తవంగా మీ కల్చర్ చూసి మేం నేర్చుకోవాలి. మీరు కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీని ఖతం చేసే తతంగాన్ని మేం చూస్తున్నం.
పార్టీ కంటే పెద్ద మేం ఎవ్వరం కాదు
పార్టీలో ఎవరు తప్పు చేసినా ఏఐసీసీ కమిటీ కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లనే చూసుకుంట పోతే భవిష్యత్‌లో పార్టీ నష్టపోతది. సురేఖ, రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ చేస్తరో ఏం చేస్తరో చేయండి. ఎందుకంటే పార్టీ కంటే పెద్ద మేం ఎవ్వరం కాదు. మేం చేతి గుర్తు మీద గెలిచినం. చేతి గుర్తును నరకాలనుకుంటున్న వారిని పార్టీని బర్తరఫ్ చేయాలి. మేమందరం అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నం అని వెడ్మ బొజ్జు స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
- ●Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- ●Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..

Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?

‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?





