త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khammam | బంగారం, న‌గ‌దు ఎత్తుకెళ్లిన దొంగ‌లు.. చివరికి మామిడికాయ ప‌చ్చ‌డినీ వ‌ద‌ల్లే..

Khammam | సాధారణంగా ఇంట్లో చొర‌బ‌డిన‌ దొంగలు బంగారం, డ‌బ్బుతోపాటు విలువైన వస్తువుల‌ను ఎత్తుకెళ్తుంటారు. కానీ ఖమ్మం (Khammam) జిల్లాలో మాత్రం ప‌చ్చ‌డిని (Chutney) కూడా వ‌ద‌లిపెట్ట‌లేదు.

G

Telangana | Published On Jun 26, 2026, 11.38 am IST

Khammam | బంగారం, న‌గ‌దు ఎత్తుకెళ్లిన దొంగ‌లు.. చివరికి మామిడికాయ ప‌చ్చ‌డినీ వ‌ద‌ల్లే..
Advertisement

Khammam | త్రినేత్ర‌.న్యూస్‌: సాధారణంగా ఇంట్లో చొర‌బ‌డిన‌ దొంగలు బంగారం, డ‌బ్బుతోపాటు విలువైన వస్తువుల‌ను ఎత్తుకెళ్తుంటారు. కానీ ఖమ్మం (Khammam) జిల్లాలో మాత్రం ప‌చ్చ‌డిని (Chutney) కూడా వ‌ద‌లిపెట్ట‌లేదు. బియ్యం, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌తోపాటు ప‌చ్చ‌డి జాడీని మొత్తం ఊడ్చేశారు. య‌జ‌మానుల గుర్తుకోసం అన్న‌ట్లు వారి పాత చెప్పుల‌న వ‌దిలి.. కొత్త పాద‌ర‌క్ష‌లు వేసుకొని వెళ్లారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురంలోని ఓ ఇంట్లోకి క‌త్తులు, గొడ్డ‌ళ్ల‌తో చొరబడిన దుండగులు.. ఐదు కాసుల బంగారం, రూ.60 వేల నగదుతో పాటు వంటనూనె, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను త‌మ‌తో తీసుకెళ్లారు. అంత‌టితో ఆగ‌కుండా ఇంట్లో జాడీలో ఉన్న మామిడికాయ పచ్చడిని (Mango Pickle) కూడా ఎత్తుకెళ్లారు. భూమి పేప‌ర్ల‌ను చించేశారు. పోతూపోతూ పాత చెప్పులను అక్కడే వదిలేసి, కొత్త చెప్పులు వేసుకుని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement