OPS | ఓపీఎస్‌పై నీలినీడలు.. సర్కార్ నిర్ణయం కోసం ఉద్యోగుల ఎదురుచూపులు..!
OPS | 2003 డీఎస్సీ టీచర్లు( DSC Teachers ) సహా ఇతర శాఖల్లోని ఉద్యోగులకు ఓపీఎస్( Old Pension Scheme ) వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( AP Govt ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోని ఉద్యోగులు( Telangana Employees ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
OPS | త్రినేత్ర.న్యూస్ : 2003 డీఎస్సీ టీచర్లు( DSc Teachers ) సహా ఇతర శాఖల్లోని ఉద్యోగులకు ఓపీఎస్( Old Pension Scheme ) వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( AP Govt ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోని ఉద్యోగులు( Telangana Employees ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2003 డీఎస్సీ టీచర్లు సహా ఇతర శాఖల్లోని ఉద్యోగులు ఓపీఎస్‌కు అర్హులేనని హైకోర్టు రెండుసార్లు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర సర్కార్ మాత్రం పెడచెవిన పెట్టడంపై మండిపడుతున్నారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఏపీ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. మరి తెలంగాణలో ఓపీఎస్ ఎప్పుడు అమలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. మొత్తానికి ఓపీఎస్ నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
వివాదం ఏంటంటే..?
2003లో డీఎస్సీతో పాటు కానిస్టేబుల్, గ్రూప్-1, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీల భర్తీ మాత్రం 2004లో జరిగింది. అయితే 2004 సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ అమల్లోకి వచ్చింది. దీంతో 2004లో ఉద్యోగాల్లో చేరిన వారందరినీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. బలవంతంగా సీపీఎస్ విధానంలోకి నెట్టింది. అయితే నోటిఫికేషన్ జారీ చేసిన తేదీని పరిగణనలోకి తీసుకుని సీపీఎస్‌ను అమలు చేయాలి. కానీ పోస్టింగ్ తేదీని పరిగణనలోకి తీసుకుని సీపీఎస్‌ను అమలు చేశారు. ఈ విధంగా సీపీఎస్‌లోకి బలవంతంగా నెట్టిన ఉద్యోగులు దాదాపు 12 వేలకు పైగా ఉంటారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. దాదాపు 20 ఏండ్లకు పైగా ఈ 12 వేల మంది పాత పెన్షన్ అమలు కోసం పోరాడుతున్నారు. కానీ వారి ప్రయత్నం ఫలించడం లేదు.
2003 డిసెంబర్‌లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీపీఎస్‌ను తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని చట్టబద్దం చేసింది. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయాక జరిగిన, జరుగుతున్నా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తాం అంటూ మేనిఫెస్టోలో పేర్కొంటూ వస్తుంది కాంగ్రెస్. సాంకేతికంగా ఉన్నది ఉన్నట్లుగా తిరిగి పాత పద్దతికి రావడం సాధ్యం అయితదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఇది వరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునఃప్రారంభించాలనే తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాత పూర్వకంగా తెలియజేశాయి. అయితే 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ ప్రకారం ఎన్‌పిఎస్ చందాదారులు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగులు సేకరించిన కార్పస్‌ను తిరిగి చందాదారులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జమ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయిననూ గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తమ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు పరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఓపీఎస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం.
తానిపర్తి తిరుపతి రావు
SA (Maths), ZPHS, పూసాల, సుల్తానాబాద్ , పెద్దపల్లి జిల్లా
ఓపీఎస్‌పై ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపీఎస్‌పై నిర్ణయం తీసుకుని.. బాధిత ఉద్యోగులకు తీపి కబురు అందించాలి. లేదంటే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
కే దేవేందర్
ఎస్జీటీ, మల్లన్నపేట్, జగిత్యాల జిల్లా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kamareddy Student | లండన్‌లో కామారెడ్డి జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి
- ●Idupu Kayitham | ఇది ఏ భాష సినిమా - ఇడుపుకాయితం సినిమాపై ఆంధ్రోళ్ల ఎగతాళి - తెలంగాణవాదుల కౌంటర్లు
- ●Bitcoin | బిట్‌కాయిన్‌కు డేంజర్ బెల్స్..? డెడ్ జోన్లోకి ప్రవేశం..
- ●Khammam | బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు.. చివరికి మామిడికాయ పచ్చడినీ వదల్లే..
- ●Adavi Dunna | నల్లమలలో అరుదైన అడవి దున్న సంచారం.. ఫొటోలు వైరల్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనుగోదారుల ఆసక్తి పెరుగుతుందా..?

Kamareddy Student | లండన్‌లో కామారెడ్డి జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి

Idupu Kayitham | ఇది ఏ భాష సినిమా - ఇడుపుకాయితం సినిమాపై ఆంధ్రోళ్ల ఎగతాళి - తెలంగాణవాదుల కౌంటర్లు

Bitcoin | బిట్‌కాయిన్‌కు డేంజర్ బెల్స్..? డెడ్ జోన్లోకి ప్రవేశం..

Khammam | బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు.. చివరికి మామిడికాయ పచ్చడినీ వదల్లే..






