త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Idupu Kayitham | ఇది ఏ భాష సినిమా – ఇడుపుకాయితం టైటిల్‌పై ఆంధ్రా ప్రజల అక్క‌సు – తెలంగాణవాదుల కౌంట‌ర్‌

ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తోన్న ఇడుపుకాయితం మూవీపై సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. అచ్చ తెలంగాణ యాస‌, భాష‌ల‌పై పెట్టిన ఈ టైటిల్‌పై కొంద‌రు ఆంధ్రా నెటిజ‌న్లు ఎగ‌తాళి చేస్తూ కామెంట్లు పెడుతోన్నారు. ఆంధ్రాలో తెలుగు డ‌బ్బింగ్ ఉంటుందా? వెట‌కారంగా పోస్ట్‌లు పెట్టారు. వీటిపై తెలంగాణ వాదులు ఫైర్ అవుతున్నార

N

Entertainment | Published On Jun 26, 2026, 12.18 pm IST

Idupu Kayitham | ఇది ఏ భాష సినిమా – ఇడుపుకాయితం టైటిల్‌పై ఆంధ్రా ప్రజల అక్క‌సు – తెలంగాణవాదుల కౌంట‌ర్‌
Advertisement

Idupu Kayitham | ప్రియ‌ద‌ర్శి,నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఇడుపుకాయితం మూవీ గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ్ అయ్యింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో క‌లిసి బ‌న్నీ వాస్ నిర్మిస్తున్నారు. వంశీ రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతోన్నారు. తెలంగాణ యాస‌, భాష‌ల‌కు ప్రాధాన్య‌మిస్తూ ఈ సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఆర్టిస్టులు కూడా చాలా వ‌ర‌కు తెలంగాణవారినే తీసుకున్నారు.

వెట‌కారం...

ఈ సినిమాకు ఇడుపుకాయితం అనే టైటిల్ పై సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. తెలంగాణ మూలాల‌ను గుర్తుచేసేలా పెట్టిన ఈ టైటిల్‌ను కొంద‌రు ఆంధ్రావాదులు వెట‌కారం చేస్తూ సోష‌ల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు పెడుతోన్నారు. ఇది ఏ భాష సినిమా...ఆంధ్రాలో తెలుగు డ‌బ్బింగ్ ఉంటుందా? స‌బ్ టైటిల్స్ వేస్తారా? అంటూ తెలంగాణ యాస‌, భాష‌ల‌ను కించ‌ప‌రిచేలా ఆంధ్రా ప్ర‌జ‌లు కామెంట్లు పెడుతోన్నారు. ఇడుపు కాయితం టైటిల్ చూసి త‌మిళ డ‌బ్బింగ్ సినిమా అనుకున్నాన‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. ప్యూర్ తెలంగాణ యాస‌తో సినిమా చేస్తే మ‌రి ఆంధ్రా వాళ్ల‌కు ఎలా అర్థం అవుతుంది అంటూ మ‌రొక‌రు పోస్ట్ పెట్టారు.

ఓర్వ‌లేనిత‌నం...

ఈ పోస్ట్‌ల‌పై తెలంగాణ వాదులు ఫైర్ అవుతోన్నారు. తెలంగాణ యాస‌, భాష‌ల‌ను త‌క్కువ చేస్తే ఊరుకునేది లేదంటూ గ‌ట్టిగానే కౌంట‌ర్లు ఇస్తున్నారు. "ఇడుపు కాయితం పేరులో, భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని. విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రమది. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం. మరి “విడాకులు” లో ఏముందిరా! ఆకులా? అర్థంకాకపోతే మూసుకోండి. సబ్ టైటిల్స్ ఉండవు. చూడకండి" అంటూ ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌మిళ సినిమాల‌కు స‌మ‌స్య‌ల ఉండ‌దా?

త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల‌ను అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే చూడ‌టానికి రాని ఇబ్బంది తెలంగాణ సినిమాలకు మాత్రం వ‌స్తుందా అంటూ ఓ నెటిజ‌న్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రం విడిపోయినా కూడా తెలంగాణ భాష‌, ఇక్క‌డి సినిమాల‌పై ఆంధ్రా ప్ర‌జ‌ల్లో ద్వేషం, వివ‌క్ష మాత్రం తొల‌గిపోలేద‌ని అంటున్నారు. తెలుగు సినిమాల్లో కేవ‌లం ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు తెలిసిన మాట‌ల‌నే వాడుతూ వ‌చ్చార‌ని, కానీ తెలంగాణ ప్ర‌జ‌లు వాటిని ఎప్పుడూ ఎగ‌తాళి చేయ‌లేద‌ని, అర్థం తెలియ‌క‌పోతే తెలుసుకోవాలి కానీ మ‌రో భాష‌ను అవ‌మానించ‌డం  స‌మంజ‌సం కాద‌ని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి పుష్క‌ర‌కాలం గ‌డిచినా... తెలంగాణ ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, సంప్రదాయాల‌పై విషం క‌క్క‌డం మాత్రం మాన‌లేద‌ని ఆంధ్రా ప్ర‌జ‌ల‌పై తీరును ఎండ‌గ‌డుతున్నారు. సినిమాను అడ్డం పెట్టుకొని తెలంగాణ‌పై త‌మ మ‌న‌సులో నాటుకుపోయిన ద్వేషాన్ని బ‌య‌ట‌పెడుతున్నార‌ని అంటున్నారు.

తెలంగాణ ఫిల్మ్ మేక‌ర్స్‌...

ఆంధ్రా నెటిజ‌న్లు పెట్టిన ట్వీట్స్‌కు ధీటుగానే రిప్లై ఇస్తున్నారు. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డితో పాటు మ‌రికొంద‌రు తెలంగాణ ద‌ర్శ‌కులు దీనిపై రియాక్ట్ అయ్యారు. మ‌ల‌యాళ సినిమాల‌ను స‌బ్‌టైటిల్స్‌తో చూసి ప్ర‌శంసించే వారికి తెలంగాణ టైటిల్స్‌, డైలాగ్స్‌పై ఇబ్బందిప‌డ‌టం విడ్డూరంగా ఉంద‌ని అంటున్నారు. ఈ వివాదంపై మేక‌ర్స్‌తో పాటు ప్రియ‌ద‌ర్శిన‌, నాగ‌దుర్గ‌తో పాటు ఇత‌ర న‌టీన‌టులు మాత్రం రియాక్ట్ కాలేదు. మొత్తానికి ఇడుపుకాయితం ఓపెనింగ్‌తోనే టాలీవుడ్‌లో సెన్సేష‌న్‌గా మారింది. రిలీజ్ సినిమాకు రావాల్సినంత ప‌బ్లిసిటీ ఓపెనింగ్ రోజే వ‌చ్చేసింద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

 

Advertisement
Advertisement