త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide attempt | భార్యాభ‌ర్తల గొడ‌వ.. పిల్ల‌ల‌కు ఎలుక‌ల మందు తినిపించిన త‌ల్లి

Suicide attempt | ఖ‌మ్మంలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఏర్ప‌డిన గొడవ ఏకంగా పిల‌ల్ల ప్రాణాల‌నే బ‌లిగొంది. ఇద్ద‌రు కుమారుల‌కు ఎలుక‌ల మందు తినిపించి ఆపై త‌ల్లి ఆత్మ‌హ‌త్యాయత్నం చేసిన ఉదంతం న‌గ‌రంలోని పంపింగ్ వెల్ రోడ్‌లో వెలుగుచూసింది.

S

Telangana | Published On Jun 21, 2026, 4.06 pm IST

Suicide attempt | భార్యాభ‌ర్తల గొడ‌వ.. పిల్ల‌ల‌కు ఎలుక‌ల మందు తినిపించిన త‌ల్లి
Advertisement
  • ఆపై తానూ ఆత్మ‌హత్యాయ‌త్నం
  • చికిత్స పొందుతూ చిన్నారులు మృతి
  • ఖ‌మ్మంలో ఘ‌ట‌న‌

Suicide attempt | త్రినేత్ర‌.న్యూస్‌: ఖ‌మ్మంలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఏర్ప‌డిన గొడవ ఏకంగా పిల‌ల్ల ప్రాణాల‌నే బ‌లిగొంది. ఇద్ద‌రు కుమారుల‌కు ఎలుక‌ల మందు తినిపించి ఆపై త‌ల్లి ఆత్మ‌హ‌త్యాయత్నం చేసిన ఉదంతం న‌గ‌రంలోని పంపింగ్ వెల్ రోడ్‌లో వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు చిన్నారులు మృతి చెంద‌గా స్థానికంగా విషాద చాయ‌లు అలుముకున్నాయి.

పోలీసుల ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. ఏదిలాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడుకు చెందిన బొబ్బాల లింగరాజుతో చింతకాని మండలం నరసింహపురానికి చెందిన స్వాతికి 9 ఏళ్ల క్రితం వివాహ‌మైంది. లింగరాజు కుటుంబ పోష‌ణ కోసం పాల వ్యాపారం చేస్తూనే ఖమ్మంలోని మొబైల్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఏడాది నుంచి ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్‌లోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు.

ఈ క్ర‌మంలో భార్యాభర్తల మధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో శనివారం సాయంత్రం ఇద్దరు కుమారులకు ఎలుకల మందు తినిపించి తల్లి స్వాతి కూడా తాగింది. వెంట‌నే స్థానికులు గమనించి ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. కుమారులు వేదిక్ (7), తనుష్ (5) మృతి చెందారు. తల్లి చికిత్స పొందుతుండ‌గా ఆమె ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

 

Advertisement
Advertisement