Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనుగోదారుల ఆసక్తి పెరుగుతుందా..?
Gold And Silver Prices Today | అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఆయా లోహాల ధరలు ఇటీవలి కాలంలో భారీగా తగ్గడంతో పెట్టుబడిదారులు కొనుగోళ్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు మిశ్రమ ధోరణిలో కొనసాగుతున్నాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఆయా లోహాల ధరలు ఇటీవలి కాలంలో భారీగా తగ్గడంతో పెట్టుబడిదారులు కొనుగోళ్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు మిశ్రమ ధోరణిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.33 శాతం తగ్గి 4,015 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.75 శాతం మేర తగ్గి 56 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1.31 శాతం మేర పెరిగి 1,43,127 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3.10 శాతం ఎగబాకి 2,19,672 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,160 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13, 280 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,600 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,16,000 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,980 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,03,840గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,29,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,98,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,620 ఉండగా, 8 గ్రాముల ధర రూ.84,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,06,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,62,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2000 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver ETF | భారీగా పతనమవుతున్న గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు.. ధరలు ఇంకా తగ్గుతాయా..?
జూన్ 26, 2026

RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్
జూన్ 26, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.27వేలు తగ్గిన బంగారం ధర.. ఈక్విటీల వైపు ప్రజల మొగ్గు..
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..
- ●Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు
- ●July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..
- ●Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక
- ●Surya bhai Arrest | గోల్డ్‌మెన్ సూర్యాభాయ్ మోసం.. ఎఫ్ఐఆర్ నమోదు
- ●Mother attack on Child | అమానుషం.. చిన్నారిని కాలితో తన్నిన తల్లి.. వీడియో

Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..

Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు

July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..

Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక



