త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మ‌మ అనిపించారు

Surabhi Vanidevi | 463 పేజీలున్న క్యూర్ బిల్లును ఇచ్చి క‌నీసం చదువుకునే టైమ్ ఇవ్వ‌లేద‌ని ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ మండిప‌డ్డారు. అంత‌టి ప్రాధాన్యం ఉన్న బిల్లును మ‌మ అనిపించార‌ని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Sep 13, 2026, 1.25 pm IST

Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మ‌మ అనిపించారు
Advertisement
  • మండ‌లి స‌మావేశాలు ప్ర‌స‌హ‌నంలా జ‌రిగాయ్‌
  • ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ విమ‌ర్శ‌లు

Surabhi Vanidevi | త్రినేత్ర‌.న్యూస్: 463 పేజీలున్న క్యూర్ బిల్లును ఇచ్చి క‌నీసం చదువుకునే టైమ్ ఇవ్వ‌లేద‌ని ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ మండిప‌డ్డారు. అంత‌టి ప్రాధాన్యం ఉన్న బిల్లును మ‌మ అనిపించార‌ని విమ‌ర్శించారు. మండ‌లి స‌మావేశాలు ప్ర‌స‌హ‌నంలా (హాస్య‌భ‌రితంగా) జ‌రిగాయని ఎద్దేవా చేశారు. ఈమేర‌కు ఆదివారం ఆమె తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.

అది తెలంగాణ‌కు అవ‌మానం కాదా?

మా మహిళా ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది. ఇక్కడ న్యాయం జరగపోతే ఢిల్లీకి వెళ్ళాం. అది తెలంగాణకు అవమానం కాదా? 40 మంది ప్రజా ప్రతినిధుల చుట్టూ 500 మంది పోలీసులను మోహరిస్తారా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే గౌరవం ఇదేనా?

463 పేజీలున్న బిల్లు ఇచ్చి చదువుకునే టైమ్ ఇవ్వరా? చైర్మన్ బిల్లు ప్రవేశపెట్టినట్టు ప్రకటించిన తర్వాత క్యూర్ బిల్లు కాపీలను మాకు అందజేశారు. మానవ మాత్రులకు నిమిషాల్లో 463 పేజీలు చదవడం సాధ్యమా? అంత ప్రాధాన్యం ఉన్న బిల్లును మమ అనిపించారు.

రేవంత్‌కు 10 శాతం మంది ప్ర‌జ‌లు కూడా మ‌ద్ద‌తిస్త‌లేరు: ఎమ్మెల్సీ ఎల్. రమణ 

సాంకేతికంగా సభ నిర్వహించాలి కాబ‌ట్టి నిర్వ‌హించాల‌న్నట్టు సమావేశాలు నడిపారు. సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ గేట్ 3 దగ్గర పోలీసులు ప్రవర్తించిన తీరు దుర్మార్గం. మా సభ్యులపై జరిగిన అమానుషంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మా ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. కేసీఆర్ ఇంటి మీద దాడికి పిలుపునివ్వడం దుర్మార్గమైన చర్య. కేసుల మీద కేసులు పెట్టి ప్రతిపక్షాన్ని వేధించారు.

సభను ప్రశాంతంగా నడపాలనే ఆలోచన ప్రభుత్వానికి మొదటి నుంచి లేదు. అందుకే పోలీసులను వాడుకుని మాపై దారుణాలకు ఒడి గట్టారు. మా ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం. ఎమర్జెన్సీని తలపింపజేసేట్టు ప్రవర్తించారు. రేవంత్‌ది చీకటి పాలన. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా పోరాటం ఆగదు. ఫ్లాష్ సర్వే పేరిట రేవంత్ ప్రజలను మభ్యపెడుతున్నారు. క్షేత్రస్థాయిలో రేవంత్ పాలనకు 10 శాతం మంది ప్రజలు కూడా మద్దతునివ్వడం లేదు. కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement
Advertisement