త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Heavy Rain | రాష్ట్రంలో ఆదివారం కూడా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

G

Telangana | Published On Sep 13, 2026, 8.29 am IST

Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Advertisement

Heavy Rain | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఆదివారం కూడా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైద‌రాబాద్‌, జ‌న‌గామ‌, క‌రీంన‌గ‌ర్‌, మేడ్చ‌ల్‌, మెద‌క్‌, పెద్ద‌ప‌ల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట‌, వికారాబాద్‌, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోనూ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. ఆయా జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది.

ఇక కొత్త‌గూడెం, హ‌నుమ‌కొండ‌, జ‌గిత్యాల‌, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, వ‌రంగ‌ల్‌, జిల్లాల్లో ఉరుములు మెరుపుల‌తో కూడిన‌ తేలిక‌పాటి వ‌ర్షం కురుస్తుంద‌ని వెల్ల‌డించింది. 30 నుంచి 40 కిలోమీట‌ల‌ర్ల‌ వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్, కాజీపేట ట్రైసిటీల్లో ఉద‌యం 9 గంట‌ల నుంచి మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. మ‌హ‌బూబాబాద్‌, భువ‌న‌గిరి, సూర్యాపేట‌లో అక్క‌డ‌క్క‌డ, న‌ల్ల‌గొండ‌లోని క‌ట్టంగూర్‌, హైద‌రాబాద్‌లో శ‌నివారం రాత్రంతా వాన కురుస్తూనే ఉంది.

Advertisement
Advertisement