Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా
Deshapathi Srinivas | కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు లేకనే పాలకపక్షం తమతో సంఘర్షణాత్మక వైఖరి అవలంభించిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రేవంత్‌రెడ్డిది విజన్ లేని పాలనే కాకుండా వజన్ లేని పాలన అని విమర్శించారు.
- సలాకలు కాల్చి వాతలు ఎవరికి పెట్టాలి రేవంత్?
- హామీలు నెరవేర్చని నీకు కాదా?
- వెయ్యి రోజుల పాలనపై చర్చించకుండా పారిపోయారు
- సీఎంపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్
Deshapathi Srinivas | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు లేకనే పాలకపక్షం తమతో సంఘర్షణాత్మక వైఖరి అవలంభించిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రేవంత్‌రెడ్డిది విజన్ లేని పాలనే కాకుండా వజన్ లేని పాలన అని విమర్శించారు. కంచెలు లేని పాలన అన్నావ్.. సభ్యుల సస్పెన్షన్లు ఉండవు అన్నావ్.. ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీ అన్నావ్.. ఇవన్నీ ఏమయ్యాయి రేవంత్ అని నిలదీశారు. అనేక ఆంక్షలు ఉన్నా ఉన్న సమయాన్ని వాడుకొని మండలిని ధూమ్ ధామ్‌కు వేదికగా మార్చుకున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ప్రభుత్వంతో చెప్పించగలిగామని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరలు సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై విమర్శల దాడి చేశారు.
అనేక ఆంక్షలు ఉన్నా దొరికిన కొద్ది సమయాన్ని మండలిలో వాడుకున్నాం. శాసన మండలిని ధూమ్ ధామ్‌కు వేదికగా మార్చుకున్నాం. వెయ్యి రోజుల పాలనపై సభల్లో చర్చిస్తామని సీఎం ఎందుకు పారిపోయారు? కృష్ణా జలాల్లో అన్యాయంపై ఎందుకు చర్చించలేదు? హామీల అమలుపై చర్చ జరగలేదు.
సీఎం ఊర్లెనే కరెంట్ కోసం కొట్లాడుతున్నరు
కేసీఆర్ మొదటి కేబినెట్‌లోనే 43 నిర్ణయాలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు మేలు చేసే ఒక్క మంచి నిర్ణయమైనా తీసుకున్నారా? బూతులు తప్ప రేవంత్ ప్రజలకు ఏం ఇచ్చారు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే ఇపుడు సీఎం గ్రామంలోనే కరెంటు కోసం ఉద్యమిస్తున్నారు. సలాకలు గాల్చి వాతలు ఎవరికి పెట్టాలి రేవంత్ రెడ్డి?హామీలు నెరవేర్చని నీకు కాదా? అన్ని విలువలు దిగజార్చి ప్రగతి పునాదులు ధ్వంసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి.
గోరటి, శ్రవణ్ గట్టిగా నిలదీసిర్రు..
పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు నులమడంపై మా గోరటి వెంకన్న, శ్రవణ్ గట్టిగా నిలదీశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ప్రభుత్వంతో చెప్పించగలిగాం. తెలంగాణ ఉద్యమకారులకు కొండంత అండగా ఉన్న హరీష్ రావుపై ఉద్యమంతో సంబంధం లేనివారు మాట్లాడతారా? డబ్బు ఉన్న మదంతో మాట్లాడుతున్నారు. దొర పోకడలు మీ హావభావాల్లోనే కనిపిస్తున్నాయి. ఉద్యమకారులు మీలాంటి వాళ్ళు ఉద్యమంలో రాకపోవడం వల్ల తెలంగాణ బిడ్డలు చనిపోయారు. ఉద్యమానికి యవ్వనాన్ని వారి జీవితాన్ని ధార పోసిన వ్యక్తుల గురించా మాట్లాడేది?
ఒక్కసారి అధికారమొస్తే ఇన్ని కుట్రలా?
ఒక్కసారి అధికారం వస్తే ఇన్ని కుట్రలా? తెలంగాణ చరిత్రను మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సమస్యలు తెచ్చిపెట్టడం తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏం సాధించారు? తెలంగాణలో లేని సంఘర్షణలు సృష్టించకండి. సూర్యుడి మీద ఉమ్మి వేస్తె వారి మీదే పడుతుంది. కేసీఆర్ ఇంటి మీదకే దాడికి వెళతారా? ఇంత కన్నా దుర్మార్గం ఉంటుందా? రేవంత్ పతనం మొదలైంది అని దేశపతి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Robotic surgery workshop TIMS | రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ఎంతో సంతోషకరం: దామోదర రాజనర్సింహ
సెప్టెంబర్ 13, 2026

Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
సెప్టెంబర్ 13, 2026

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
- ●Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు
- ●TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ
- ●Sirikonda Madhusudanachary | ఆరు రోజుల్లో ఏ ఒక్క షార్ట్ డిస్కషన్ సరిగా జరగలే
- ●BRICS Summit New Delhi | బ్రిక్స్ సదస్సులో భారత్ దౌత్య విజయం: పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య మోదీ.. 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు సర్వసమ్మతి
- ●Vinayaka Chavithi | గజముఖ గణపతి రూపాలెన్నో తెలుసా?.. ఒక్కో స్వరూపానికి ఒక్కో విశిష్ఠత..

Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు

TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ

Sirikonda Madhusudanachary | ఆరు రోజుల్లో ఏ ఒక్క షార్ట్ డిస్కషన్ సరిగా జరగలే



