త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayodhya Case | అయోధ్య రామాల‌యం చోరీ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!

Ayodhya Case | అయోధ్య రామాలయ కానుకల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకుంది. అరెస్టయిన ఎనిమిది మంది నిందితులపై అభియోగాలను నిరూపించేందుకు తగిన ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 7వేల పేజీల కేసు డైరీని సిద్ధం చేసిన అధికారులు.. సెప్టెంబర్‌ 22, 23 తేదీల్లో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

P

National | Published On Sep 13, 2026, 2.58 pm IST

Ayodhya Case | అయోధ్య రామాల‌యం చోరీ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!
Advertisement

Ayodhya Case | అయోధ్య రామాలయ కానుకల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకుంది. అరెస్టయిన ఎనిమిది మంది నిందితులపై అభియోగాలను నిరూపించేందుకు తగిన ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 7వేల పేజీల కేసు డైరీని సిద్ధం చేసిన అధికారులు.. సెప్టెంబర్‌ 22, 23 తేదీల్లో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసు డైరీలో నిందితుల వాంగ్మూలాలు, ఆలయ ప్రాంగణం, చోరీ జరిగిన ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు, నగలు, కీలక పత్రాలను పొందుపరిచారు.

ఈ ఆధారాలన్నింటినీ అనుసంధానించి నిందితుల పాత్రను ఖరారు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. చార్జిషీట్‌ దాఖలుకు ముందు కేసు డైరీలోని ఆధారాల బలంపై, నిందితుల పాత్రపై జోనల్‌ స్థాయిలోనూ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 5 వరకు ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. కానుకలను దాచడం, ఆలయం నుంచి తీసుకెళ్లడం వంటి 70కిపైగా ఘటనలను గుర్తించారు.

విదేశీ భక్తుల్లో మళ్లీ విశ్వాసం

కానుకల చోరీ ఘటన తర్వాత రామాలయానికి వచ్చే విదేశీ భక్తుల సంఖ్య త‌గ్గింది. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మారుతోంది. పారదర్శకత కోసం ఆలయ నిర్వహణలో చేపడుతున్న కొత్త ఏర్పాట్లు, మార్పులతో విదేశీ భక్తుల్లో రామలల్లాపై విశ్వాసం తిరిగి పెరుగుతోంది. శుక్రవారం అమెరికాకు చెందిన 10 మంది భక్తులు రామలల్లాను దర్శించుకున్నారు. వీరిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. చోరీ ఘటన తర్వాత తగ్గిన భక్తుల సంఖ్య మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది.

Advertisement
Advertisement