Mark Zuckerberg | మళ్లీ ఎక్స్‌లోకి జుకర్‌బర్గ్.. ఎందుకంటే?
Mark Zuckerberg | మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మళ్లీ ఎక్స్ (X)లో యాక్టివ్ అయ్యారు. దాదాపు మూడేళ్ల బ్రేక్ తర్వాత 2026లో ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌లోకి తిరిగి వచ్చిన ఆయన.. ప్రస్తుతం వరుసగా పోస్టులు పెడుతున్నారు.
- మూడేళ్ల విరామం తర్వాత యాక్టివ్.. వరుసగా పోస్టులు
- థ్రెడ్స్ ఉన్నా.. ఏఐ కమ్యూనిటీ అక్కడే ఉందన్న మెటా చీఫ్
Mark Zuckerberg | మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మళ్లీ ఎక్స్ (X)లో యాక్టివ్ అయ్యారు. దాదాపు మూడేళ్ల బ్రేక్ తర్వాత 2026లో ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌లోకి తిరిగి వచ్చిన ఆయన.. ప్రస్తుతం వరుసగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 9న మెటా కొత్త ఏఐ ఉత్పత్తి ‘మ్యూజ్ పర్సనల్ ఏజెంట్’ గురించి ఎక్స్‌లో పోస్టు చేశారు. యూజర్ లక్ష్యాలను అర్థం చేసుకుని, వాటిని సాధించేందుకు చురుగ్గా పనిచేసే ఏఐ ఏజెంట్‌గా మ్యూజ్‌ను ఆయన వివరించారు. అయితే మెటాకు సొంతంగా థ్రెడ్స్ ఉండగా.. ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో జుకర్‌బర్గ్ ఎందుకు పోస్టులు పెడుతున్నారన్న చర్చ మొదలైంది. దీనిపై ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి జుకర్‌బర్గ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఏఐ కమ్యూనిటీ అక్కడే ఉంది..
మెషిన్ లెర్నింగ్, ఏఐ పరిశోధన, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఇంజినీర్లు, పరిశోధకుల్లో గణనీయమైన భాగం ఇప్పటికీ ఎక్స్‌లోనే యాక్టివ్‌గా ఉంటున్నారని జుకర్‌బర్గ్ చెప్పారు. అందుకే వారు ఉన్న చోటే వారితో మాట్లాడేందుకు ఎక్స్‌లోనూ తమ ఉనికిని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఏఐ రంగంలో ఎక్స్ కీలక వేదికగా కొనసాగుతోందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. థ్రెడ్స్ కూడా మంచి పనితీరు కనబరుస్తోందని చెప్పిన జుకర్‌బర్గ్.. సోషల్ మీడియాలో ఒక్కో వర్గం ఒక్కో ప్లాట్‌ఫామ్‌లో ఉంటుందని వివరించారు. అందుకే ఒకే కంటెంట్‌ను థ్రెడ్స్‌తో పాటు ఎక్స్‌లోనూ పోస్టు చేస్తున్నామని చెప్పారు. విస్తృతంగా ప్రజలకు చేరువ కావడానికి ఒకచోట ప్రచురించిన కంటెంట్‌ను ఇతర వేదికల్లోనూ పంచుకోవడం సహజమేనని పేర్కొన్నారు. ఇలా చూస్తే.. జుకర్‌బర్గ్ ఎక్స్‌లోకి తిరిగి రావడం కేవలం వ్యక్తిగత సోషల్ మీడియా యాక్టివిటీ కాదని, మెటా కొత్త ఏఐ ఉత్పత్తులు, మోడళ్లను నేరుగా ఏఐ డెవలపర్లు, పరిశోధకులు, టెక్ వర్గాలకు చేరవేసే వ్యూహంలో భాగమేనని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
- ●Ayodhya Case | అయోధ్య రామాలయం చోరీ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!
- ●Anwar Ibrahim Rahul Gandhi Meeting | ఢిల్లీలో ఆసక్తికర భేటీ: రాహుల్ గాంధీ, ప్రియాంకలతో మలేషియా ప్రధాని బ్రేక్‌ఫాస్ట్
- ●Abhijeet Dipke Fake Resignation Letter | మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా? గిరిజన పిల్లల మరణాలపై వైరల్ అవుతున్న 'లేఖ' వెనుక అసలు నిజం!
- ●Chiranjeevi | ఇరుముడి టీమ్‌కు మెగాభినందనలు
- ●Toll Booths | ఇక టోల్ దగ్గర ఆగాల్సిన పనిలేదు!
- ●BRICS Dinner Menu | బ్రిక్స్ డిన్నర్లో ప్రపంచ నేతలకు వడ్డించిన మెనూ ఇదే..!

Ayodhya Case | అయోధ్య రామాలయం చోరీ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!

Anwar Ibrahim Rahul Gandhi Meeting | ఢిల్లీలో ఆసక్తికర భేటీ: రాహుల్ గాంధీ, ప్రియాంకలతో మలేషియా ప్రధాని బ్రేక్‌ఫాస్ట్

Abhijeet Dipke Fake Resignation Letter | మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా? గిరిజన పిల్లల మరణాలపై వైరల్ అవుతున్న 'లేఖ' వెనుక అసలు నిజం!

Chiranjeevi | ఇరుముడి టీమ్‌కు మెగాభినందనలు





