Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్‌ఫర్డ్’ను తీసుకొస్తడట
Meheshwar Reddy | తెలంగాణ రాష్ట్రంలో 32 వేలకు పైగా పాఠశాలలుంటే దాంట్లో 21,121 పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని.. పైగా ఎక్కడో ఉన్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని తీసుకొస్తామని సీఎం అనడం విడ్డూరమని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
- 1752 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవ్
- దాదాపు 1800 బడుల్లో తాగు నీరు లేదు
- ఫీజు బకాయి-బీజేపీ లడాయి దీక్షలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఫైర్
Meheshwar Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో 32 వేలకు పైగా పాఠశాలలుంటే దాంట్లో 21,121 పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని.. పైగా ఎక్కడో ఉన్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని తీసుకొస్తామని సీఎం అనడం విడ్డూరమని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ అందరినీ మోసం చేసి ఇక విద్యార్థులను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. ఫీజు బకాయి-బీజేపీ లడాయి రెండు రోజుల దీక్షలో భాగంగా సోమవారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మధ్యాహ్న భోజనానికి కూడా పైసలు కేటాయిస్తలేరు..
విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. విద్యార్థులు చదువుకోడాని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నది. ఈరోజు నిర్బంధ పాలన నడుస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్ష చేయాలంటే పర్మిషన్‌ను క్యాన్సిల్ చేశారు. అందుకే బీజేపీ ఆఫీసులో ఈ దీక్ష చేస్తున్నాం. ఈ పోలీసుల నిర్బంధ పాలనలో ఏం చెప్పదలుచుకున్నరు. ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కారు. ఈరోజు విద్యార్థులను కూడా మోసం చేసే పని నడుస్తోంది. విద్యార్థులకు స్కూటీలు కొనిస్తమన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇస్తమన్నారు.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తమన్నారు.. విదేశీ విద్యకు ప్రోత్సాహం ఇస్తమన్నారు.. చివరికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా నిధులు కేటాయించని పరిస్థితి ఉంది.
బీహార్‌లో విద్యకు 20 శాతం నిధులిస్తే.. ఇక్కడ 8 శాతమే ఇచ్చారు
ఈ దేశంలో బీహార్‌లో కూడా 20 శాతం నిధులు కేటాయిస్తే మనదగ్గర కేవలం 8 శాతం నిధులే కేటాయించారు. విద్యార్థి లోకాన్ని పూర్తిగా మోసం చేస్తుంది. మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేశారు. రైతులను మోసం చేశారు. ఇక్కడ విద్యా మంత్రి లేడు. రేవంత్ విదేశీ పర్యటనలు చేస్తుండు.
32 వేల పాఠశాలలుంటే దాంట్లో 21121 పాఠశాలల్లో కనీస వసతులు లేవు. శిథిలావస్థలో ఉన్నాయి. బాత్రూంలు కూడా లేవ్. దాదాపు 1800 బడుల్లో తాగు నీరు లేవు. 1752 పాఠశాలల్లో బాలికలకు కూడా మరుగుదొడ్లు లేవు. ఇక్కడ ఇయ్యడానికే నిధులు లేవంటూనే ఎక్కడో ఉన్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని తీసుకొస్తడట. ఇక్కడ కనీస సౌకర్యాలు ఇవ్వని నువ్వు విదేశాలకు వెళ్లి ఏం చెప్పదలుచుకున్నావు రేవంత్? మీ అందరి పక్షాన బీజేపీ మద్దతుగా ఉంటది. సమస్యలు పరిష్కారం అయ్యే దాకా కొట్లాడుతం అని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం
ఆగస్టు 24, 2026

Jeevan Reddy | రేవంత్.. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చెయ్.. రోజూ 5 టీఎంసీల నీళ్లు దిగువకు పోతున్నయ్
ఆగస్టు 24, 2026

Vinod Kumar | పాలిటెక్నిక్ విద్యనే వద్దట.. అది చెప్పడానికి అసలు ఆకునూరి మురళి ఎవరు?
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Avinya27 | యువ ఆవిష్కర్తలకు కేంద్రం పిలుపు.. అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్..
- ●Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్
- ●Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్
- ●Jantar Mantar Protest | మహిళా ఆందోళనకారులను వేధించారని ఆరోపణలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
- ●Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్
- ●Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!

Avinya27 | యువ ఆవిష్కర్తలకు కేంద్రం పిలుపు.. అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్..

Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్

Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్

Jantar Mantar Protest | మహిళా ఆందోళనకారులను వేధించారని ఆరోపణలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!



