త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్‌పై ట్రోల్‌.. ఇదేం విడ్డూరం అంటూ సోష‌ల్ మీడియాలో విసుర్లు..!

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ఇటీవల నటించిన రక్షాబంధన్ యాడ్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. సంప్రదాయ పండగ నేపథ్యంతో రూపొందించిన ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులపై ప‌లువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరికొందరు న‌టికి మద్దతుగా నిలిచారు.

P

Entertainment | Published On Aug 24, 2026, 2.14 pm IST

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్‌పై ట్రోల్‌.. ఇదేం విడ్డూరం అంటూ సోష‌ల్ మీడియాలో విసుర్లు..!
Advertisement

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ఇటీవల నటించిన రక్షాబంధన్ యాడ్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. సంప్రదాయ పండగ నేపథ్యంతో రూపొందించిన ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులపై ప‌లువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరికొందరు న‌టికి మద్దతుగా నిలిచారు. ఈ ప్రకటనలో కృతి సనన్‌ తన సోదరుడికి రాఖీ కట్టడంతోపాటు తన పెంపుడు కుక్కకు రాఖీ కడుతున్నట్లు చూపించారు. ఈ యాడ‌లో ఆమె ధరించిన ఇండో-వెస్ట్రన్ దుస్తులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. బ్రాలెట్‌ తరహా బ్లౌజ్‌, కేప్‌, డ్రేప్డ్‌ స్కర్ట్‌తో కూడిన డ్రెస్‌ను ధ‌రించింది.

రక్షాబంధన్‌ వంటి సంప్రదాయ పండగకు సంబంధించిన ప్రకటనలో కృతి దుస్తులు సరికావంటూ పలువురు సోషల్‌మీడియా వేదిక‌గా యూజ‌ర్లు వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రకటన చూసి షాక్‌ అయ్యా. ఇదేం విడ్డూరం?’’ అంటూ ఓ నెటిజన్‌ అసహనం వ్యక్తం చేశారు. మరో నెటిజ‌న్ యాడ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ.. ‘‘ఇది పూర్తిగా సిగ్గుచేటు’’ అని పేర్కొన్నాడు. మ‌రొక‌రు స్పందిస్తూ ‘‘పూజా పళ్లెం ఎక్కడ? సోదరుడి ముందు బ్రా ధరించి ఎందుకు ధ‌రించారు. ఇది రక్షాబంధన్ పండ‌గేనా? తిలకం ఎక్కడ?’’ అంటూ కృతి స్టైలింగ్‌పై ప్రశ్నలు సంధించారు. రక్షాబంధన్‌ సందర్భంగా ఏ మహిళా ఇలాంటి దుస్తులు ధరించదంటూ మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పించారు.

అండ‌గా నిలిచిన మ‌రికొంద‌రు..

కృతి సనన్‌పై వస్తున్న విమర్శలను పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ఆమె ధరించింది బికినీ కాద‌ని పేర్కొన్నారు. దుస్తులను ప్రతి ఒక్కరి సంప్రదాయం, మర్యాద నిర్వచనంతో చూడాల్సిన అవసరం లేదని ఓ నెటిజన్ తెలిపాడు. ‘‘మహిళలు ఏం చేసినా విమర్శించేవాళ్లు ఉంటారు. గతంలో సినిమాల్లో కృతి ధరించిన దుస్తులను ప్రశంసించిన వారే ఇప్పుడు ఆమె వస్త్రధారణను ప్రశ్నిస్తున్నారు’’ అంటూ మరో నెటిజన్‌ వ్యాఖ్యానించాడు. మహిళల దుస్తులపై తీర్పులు ఇవ్వకుండా.. వారి జీవితాన్ని వారికి న‌చ్చిన‌ట్లుగా జీవించనివ్వాలంటూ మ‌రికొంద‌రు కృతికి మద్దతు తెలిపారు.

కృతి సనన్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. చివరిసారిగా ‘కాక్‌టెయిల్‌ 2’ మూవీలో క‌నిపించింది. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. లవ్‌ రంజన్‌, తరుణ్‌ జైన్‌ ఈ చిత్రానికి సహ రచయితలుగా వ్యవహరించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ.. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

Advertisement
Advertisement