Vinod Kumar | పాలిటెక్నిక్ విద్యనే వద్దట.. అది చెప్పడానికి అసలు ఆకునూరి మురళి ఎవరు?
Vinod Kumar | ఆకునూరి మురళి అసలు పాలిటెక్నిక్ విద్యనే వద్దంటున్నారని.. వద్దనడానికి అసలు ఆయన ఎవరని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ అన్నారు. స్కిల్ యూనివర్సిటీ చట్టం, జీవో 97 పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్నారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ పాలిటెక్నిక్ విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేయలేకపోయారని విమర్శించారు.
- మంత్రి వివేక్ విద్యార్థుల సందేహాలకు సమాధానం చెప్పలేకపోయారు
- స్కిల్ యూనిర్సిటీ చట్టం, జీవో 97 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి
- నాలుగో పాయింట్ విద్యార్థులు అయోమయంలో ఉన్నారు
- ముఖ్యమంత్రి జీవో 97పై వెంటనే సమీక్షించి రద్దు చేయాలి
- మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ డిమాండ్
Vinod Kumar | త్రినేత్ర.న్యూస్: ఆకునూరి మురళి అసలు పాలిటెక్నిక్ విద్యనే వద్దంటున్నారని.. వద్దనడానికి అసలు ఆయన ఎవరని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ అన్నారు. స్కిల్ యూనివర్సిటీ చట్టం, జీవో 97 పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్నారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ పాలిటెక్నిక్ విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేయలేకపోయారని విమర్శించారు. స్కిల్ యూనివర్సిటీకి తాము వ్యతిరేకం కాదని.. పాలిటెక్నిక్ వ్యవస్థను కొనసాగిస్తూనే ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. జీవో 97పై నాలుగో పాయింట్ విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోందని.. సీఎం రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
జీవో 97 రద్దుకు బీఆర్ఎస్ మద్దతు..
ప్రస్తుతం రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కింద పని చేస్తున్నట్టుగానే పాలిటెక్నీక్ కళాశాలల వ్యవస్థను కొనసాగించాలి. జీవో 97 రద్దు చేసే దాకా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తేవడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన న్యాయమైనదిగా లోతైన పరిశీలన చేసిన తర్వాత బీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చింది. రకరకాల జీవోలు తెచ్చి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టారు.
స్కిల్ యూనివర్సిటీ అనేది కేవలం డిగ్రీలు ఇవ్వడానికే పరిమితమని చట్టంలో పేర్కొన్నారు. ఈ నిమిషానికి స్కిల్ యూనివర్సిటీకి ఏఐసీటీ ఈ గుర్తింపు లేదు. స్కిల్ యూనివర్సిటీని పీపీపీ విధానంలో పని చేస్తుందని ఆ చట్టంలో చెప్పారు. ప్రైవేటు అంటే పాలిటెక్నిక్ విద్యార్థులకు అనేక అనుమానాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి మునుపే ఈ పాలిటెక్నిక్ కళాశాలల వ్యవస్థ ఉంది. స్కిల్ యూనివర్సిటీ చట్టం, జీవో 97 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కింద పని చేస్తున్నట్టుగానే పాలిటెక్నిక్ కళాశాలల వ్యవస్థను కొనసాగించాలి. చాలా బీద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే పాలిటెక్నిక్ విద్యార్థుల్లో అనవసరంగా భయాందోళనలు సృష్టించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ పెట్టి వెంటనే 97 జీవోను రద్దు చేయాలి.
జీవో 97ను సీఎం, కార్మిక మంత్రి లోతుగా సమీక్షించాలి.
1982 విద్య చట్టం ప్రకారం..
1982 విద్య చట్టం ప్రకారం ఉన్న పాలిటెక్నిక్ వ్యవస్థను కొనసాగించాలి. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు ఇంజనీరింగ్ అడ్మిషన్లను ఇప్పించేందుకు ప్రత్యేక కళాశాలలు ఏర్పాటు చేయాలి. శక్తి పేరిట పాలిటెక్నిక్ విద్యార్థుల శక్తిని నిర్వీర్యం చేయొద్దు. జీవో 97 రద్దు చేసే దాకా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. జీవో 97 లో నాలుగో పాయింట్ విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీవో 97 పై అత్యవసర సమీక్ష చేయాలి అని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
- ●Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం
- ●Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..
- ●Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
- ●Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు
- ●Miss Universe India 2026 | కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఎవరీ కాజియా లిజ్ మెజో..?

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం

Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..

Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్





