Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్
అల్లు అర్జున్ రాకాలో ఇప్పటికే నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. తాజాగా మరో మలయాళ బ్యూటీ ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాన్ ఇండియన్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Aug 24, 2026, 2.19 pm IST
Aishwarya Lekshmi | ఓ సినిమాలో ఒకరు లేదంటే ఇద్దరు హీరోయిన్లు ఉండటం కామన్. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్‌ను స్టార్ హీరోలు తిరగరాస్తున్నారు. ఒకే సినిమాలో నలుగురైదుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తోన్నారు. అల్లు అర్జున్ రాకాలో దీపికా పడుకోణ్‌తో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కథానాయికలుగా కనిపించబోతున్నారు. తాజాగా వీరితో పాటు మరో మలయాళ బ్యూటీ రాకాలో అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విలన్‌గా...
మణిరత్నం పొన్నియన్ సెల్వన్, థగ్‌లైఫ్ సినిమాల ఫేమ్ ఐశ్వర్య లక్ష్మి రాకాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్‌గా కాకుండా విలన్‌గా ఈ సినిమాతో ఐశ్వర్య లక్ష్మి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. కంప్లీట్ నెగెటివ్ షేడ్స్‌లో ఈ బ్యూటీ క్యారెక్టర్ సాగనుందని అంటున్నారు. డైరెక్టర్ అట్లీ పాత్రను డిజైన్ చేసిన తీరు నచ్చడంతో ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో...
సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో రాకా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకాబోతుంది. ఈ షెడ్యూల్ నుంచే ఐశ్వర్య లక్ష్మి రాకా షూటింగ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. రాకాలో అల్లు అర్జున్ మల్టీపుల్ షేడ్స్‌లో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఓ పాత్రకు జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపిస్తుందని అంటున్నారు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాకా మూవీ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది.
సంబరాల ఏటిగట్టు...
మలయాళ సినిమాలతో ఐశ్వర్య లక్ష్మి కెరీర్ మొదలైంది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్‌కు దూరంగా యాక్టింగ్‌కు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటోంది. తెలుగులో సత్యదేవ్ గాడ్సేతో పాటు అమ్ము సినిమాలు చేసింది. ప్రస్తుతం మెగా హీరో సాయిధరమ్‌తేజ్ సంబరాట ఏటిగట్టులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక – గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
ఆగస్టు 24, 2026

NBK 111 | సంక్రాంతి రేసు నుంచి బాలయ్య ఔట్ – ఎన్బీకే 111 రిలీజ్ డేట్ ఇదేనా?
ఆగస్టు 23, 2026

Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!
- ●Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం
- ●Marathi Language Rule Mumbai | మరాఠీ రాకపోతే రూ.20 వేలు ఫైన్.. ముంబైలో భగ్గుమన్న ఆటో డ్రైవర్లు.. 3 రోజుల బంద్
- ●Circuit House Issue | సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా.. అత్యవసర విచారణకు నో..!
- ●Polytechnic Colleges Bandh | పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్: ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ABVP పిలుపు
- ●Nagarkurnool | అచ్చంపేట మీదుగా ఎలివేటెడ్ కారిడార్

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!

Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం

Marathi Language Rule Mumbai | మరాఠీ రాకపోతే రూ.20 వేలు ఫైన్.. ముంబైలో భగ్గుమన్న ఆటో డ్రైవర్లు.. 3 రోజుల బంద్

Circuit House Issue | సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా.. అత్యవసర విచారణకు నో..!



