Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం
Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్ లాగ ఇది ఫాంహౌస్ ప్రభుత్వం కాదని.. ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. నిజాయితీగా, జవాబుదారీతనంతో ముందుకు పోతుంటే హరీశ్‌రావు ఓరుస్తలేరని మండిపడ్డారు.
- మీలాగ బీజేపీ నేతలతో వ్యాపారాలు చేయలే.. తప్పు లేందే వెబ్‌సైట్ మూసేశారా?
- సమస్యలు పరిష్కరిస్తూ జవాబుదారీతనంతో ముందుకు పోతున్నం
- మీరు ఎందుకు ఓరుస్తలేరు.. ప్రజల్లో భయాందోళనలు ఎందుకు సృష్టిస్తున్నరు
- ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ లాగ ఇది ఫాంహౌస్ ప్రభుత్వం కాదని.. ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. నిజాయితీగా, జవాబుదారీతనంతో ముందుకు పోతుంటే హరీశ్‌రావు ఓరుస్తలేరని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఓవైపు బీజేపీ పార్టీ నేతలకు సంబంధించిన సంస్థలతో వ్యాపారాలు చేసిన హరీష్ రావు.. తన బండారం బయటపడటంతో తన కంపెనీ వెబ్‌సైట్‌ను మూసేశారు. ఏ తప్పూ లేకపోతే కంపెనీ వెబ్‌సైట్‌ను ఎందుకు మూసేశారు?
ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం హరీష్ రావుకు మొదటి నుంచీ అలవాటే. ప్రభుత్వ భూముల అమ్మకాలు, పర్సంటేజీలు తీసుకోవడం, బండారం బయటపడిన తర్వాత వెబ్‌సైట్‌ను మూసేయడం వంటి అంశాలపై హరీశ్ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా సిగ్గుపడుతున్నారు. సమస్య వచ్చినప్పుడు నిజాయితీగా, జవాబుదారీతనంతో ముందుండి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపుతుంటే ఎందుకు ఓరుస్తలేరు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారు అని పొంగులేటి ఆరోపించారు.
సంబంధిత వార్తలు

Jeevan Reddy | రేవంత్.. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చెయ్.. రోజూ 5 టీఎంసీల నీళ్లు దిగువకు పోతున్నయ్
ఆగస్టు 24, 2026

Vinod Kumar | పాలిటెక్నిక్ విద్యనే వద్దట.. అది చెప్పడానికి అసలు ఆకునూరి మురళి ఎవరు?
ఆగస్టు 24, 2026

Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Circuit House Issue | సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా.. అత్యవసర విచారణకు నో..!
- ●Polytechnic Colleges Bandh | పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్: ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ABVP పిలుపు
- ●Nagarkurnool | అచ్చంపేట మీదుగా ఎలివేటెడ్ కారిడార్
- ●LPG Pipeline | 1800 కి.మీ. కొత్త ఎల్పీజీ పైప్లైన్లు.. రూ.7వేల కోట్ల పెట్టుబడి..
- ●Techie | ట్రావెల్ వీడియోల కోసం.. ఏడాదికి రూ.85 లక్షల ప్యాకేజీ ఉద్యోగాన్ని వదులుకున్న టెకీ
- ●Jeevan Reddy | రేవంత్.. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చెయ్.. రోజూ 5 టీఎంసీల నీళ్లు దిగువకు పోతున్నయ్

Circuit House Issue | సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా.. అత్యవసర విచారణకు నో..!

Polytechnic Colleges Bandh | పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్: ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ABVP పిలుపు

Nagarkurnool | అచ్చంపేట మీదుగా ఎలివేటెడ్ కారిడార్

LPG Pipeline | 1800 కి.మీ. కొత్త ఎల్పీజీ పైప్లైన్లు.. రూ.7వేల కోట్ల పెట్టుబడి..



